నీది యని చెప్పఁదగు వస్తువేది యిచట?
యపుడు నీవెంటవచ్చెడు నద్ది యేది?
ఏవియును గూడ రావన్ని యిచట నిలుచు
సుతలు మనుమలు బందుగుల్ సుతులు సతులు
తోడబుట్టువుల్ హితులు నీతోడరారు
ధనమురా దొక మొలత్రాడయినను రాదు.
వాజ్మనఃకాయముల దేనివలన నైన
నీవుచేసిన కర్మమే నీదిసుమ్ము
ఇదియె వదలక నిన్వెంబడించునద్ది
నీది యనఁదగినది మeజీయేది లేదు.
నీడలాగునఁ గర్మంబు నిన్ను విడువ
దెపుడు దుష్కృతు లుపసంహరింపబడవు
ధర్మ కార్యంబు లెపుడు వ్యర్ధములు కావు
భావిఫలసముచ్చయ దానవైభవము లగును.
మన సంపదలకే కాదు. మన యాపదలకే కాదు; మన జన్మములకే కాదు; మన మోక్షమునకే కాదు; మనతో సంబంధించిన యన్నిటికిఁ గూడ మనమే కర్తలము. కాని సుఖ మనుభవించునప్పడు మన ప్రయోజకత్వమని యహంకరించి కష్టములు వచ్చినప్పడు మాత్రము పైవారి నుత్తరవాదులుగాఁ జేయుచున్నాము. తిట్టించుటకు, నెట్టించుటకుఁ, గట్టించుటకు, బ్రభువులు చాలియున్న కారణముచేత వారు తమ కపకృతిజేసినారని నిష్కారణముగా వారిని జనులు నిందించుచుందురు. ఇది యత్యంతపాప హేతువని నిశ్చయముగా నమ్మవలయును. నీ కర్మముతోఁ బ్రభువుల కేమిసంబంధము? ప్రభువుల కర్మముతో నీ కేమైన సంబంధమున్నదని నీవు చెప్పఁగలవా? వారి విషయమున నీకు సంబంధము లేనట్టే నీ విషయమున వారికిఁగూడ లేదను జ్ఞానము నీ కుండనక్కఱలేదా?
భారతదేశ దాస్యమునుగూర్చి పరిపాలకులను బరిపరివిధములుగా నిరసించుట కలదు. భారతదేశ ప్రారబ్దమునకుఁ బాశ్చాత్యదేశ ప్రారబ్దమునకు నేమి సంబంధము? తండ్రికర్మమునకుఁ గొడుకుకర్మమునకు సంబంధము లేనప్ప డనాత్మతత్త్వమునకు నధ్యాత్మతత్త్వమున నేమిసంబంధము? వారిప్పడు సుఖప్రారబ్దమున నున్నారు. మనము కష్టప్రారబ్దమున నున్నాము అంతే! అంతకాక మరి యేమున్నది. మన వేదములను వదలుకొని, మన వర్ణాశ్రమధర్మములను వదలుకొని, మన మతమును వదలుకొని, మన యాచారములను వదలుకొని, మన విద్యలను వదలుకొని, మన స్వాతంత్ర్యములను వదలుకొని, మనజాతితత్త్వ మును గూడ వదలుకొని, యేకాలమందుఁగూడ నేదేశమందుఁగూడ నేజాతికూడ జేయని చేయలేని మహాఘోరకర్మమును జేసినందులకు ఫలమిప్ప డనుభవించు చున్నాము. కన్నులు దెఆచి బుద్దిపూర్వకముగ, సంతోష పూర్వకముగ జుట్టుచేతి కిచ్చిన మనము స్వతంత్రత కావలయునని యిప్పడు గించుకొన్న వినియోగమేమి? ఒక్క స్వతంత్రతమాత్ర మెన్నడయిన వచ్చునా? మనము బుద్దిహీనతచే వదలుకొన్న వేదాదులన్నియు వచ్చినప్పడే