పుట:SaakshiPartIII.djvu/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీరు మీశాలలకు వచ్చువారికందఱకు క్షురకర్మ కాలమందు బుద్దమతమును బోధించుచుం డవలయును. అందువలన మీరు తరింతురు. మీపాదముల యొద్దకు వచ్చి మీ సమయమును కనిపట్టి మీవలనఁ గృతార్థులగుచున్న మీయాశ్రితు లందఱు తరింతురు.

ఇది కాక పూర్వమహాప్రభువులయాస్థానములలో బ్రభుశిఖామణికి మంగలి యొక్కడు కొంచెము హెచ్చుతగ్గుగా వేడుక చెలికాని వంటివాఁ డుండెడువాఁడు. ఆతనికి నియమితమైన కొలు వేదియు లేదు. ఆతడు రాత్రియెనిమిది గంటలకు మహాప్రభువునొద్దకుఁ బోయి యాతని మంచమునొద్ద విలాసముగాఁ గూరుచుండి వేడుకకై యొక్కసారి యాయన కాళులపై జేయివైచి యూరిలోనివింత లన్నియుఁ జెప్పచుండె డివాఁడు. ఇట్టి మంగలి మహానుభావులెందరితో మహాప్రభువులచేతఁ బ్రజలకు నీనాములిప్పిం చినారు. ఉద్యోగము లిప్పించినారు. బహుమానము లిప్పించినారు. మహాస్థానములలోనున్న యినాములన్నియు నిట్టు పుట్టినవే. మన ముత్తాతల ముత్తాత లిట్టు లెన్నివేల కుటుంబములకో యుపకృతు లొనర్చినారు. అట్టిగౌరవము మన కిప్ప డున్నదా? లేదు. అట్టి మహాప్రభువు లిప్పడున్నారా? లేరు.

మనజాతి పుట్టుకను గూర్చి యనేకములగు పాఠభేదము లున్నవి. ఈపాఠభేదము లన్నియుఁ బరిశీలించి నా విమర్శనశక్తి నంతయు ధారపోయగా తుదకు నాకేమి తోఁచిన దనగా మంగళ్లు కత్తిచే జీవించువారగుట చేతను, క్షత్రియులు కత్తితో జీవించువా రగుటచేతను, వీరు వారుకూడ బౌరుషవంతు లగుటచేతను బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులన్న వర్ణవిభాగము సరియైనది కా దనియు, బ్రహ్మాక్షురకవైద్యశూద్రులుననది సరియయిన దనియు మంగలిమహాజాతిలో క్షత్రియజాతి యంతర్లాపి యనియు నేను స్థిరపఱచినాను.

తన్ను తన్ను మని సభలో గొందఱు రాజులు లేచిరి. రాజులీసభ కేల వచ్చియుండ రనంగా నాదినమునఁ బశువుల సంతలోఁ బశువులఁ గొనుటకై వచ్చి జెండాల బండారము జూచి యిది యేమోయని యిక్కడకు వేడుకకై వచ్చియుండిరి. అంత సభలోఁగొంత యల్లరియైనది. నేను లేచి కత్రియులను బతిమాలుకొని శాంతిపఱచితిని. కత్రియులు కొందఱు, బ్రాహ్మణులు కొందఱు సభనుండి లేచిపోయిరి. ఇట్లు పోయిన బ్రాహ్మణులకుఁ గాని, వారి బంధువులకుఁ గాని క్షౌరము చేయకుండుటకు మంగళ్లు రహస్యముగ నేర్పాటుచే సికొన్నట్టు వారి గుసగుసలవలన నాకుఁ దోఁచినది. వక్త తిరుగ నిట్లు చెప్పసాగెను.

కవులకుఁ దిట్లు తప్పవు. పరిశోధకుల కంతకంటె తప్పవు. భూమి తిరుగుట లేదన్నవాఁడు భూమిపై నున్నాఁడు. అది తిరుగ నని చెప్పినవాఁ డంతక్షపురియం దున్నాఁడు. నాపరిశోధన సత్యమును గ్రహించుటకుఁ బ్రజ లింకఁ దగిన జ్ఞానముతో లేరు అయినను నీపట్టణసంబంధమగు నొక్క పరిశోధనము చెప్పి విరమింతును.

అంతట నేను లేచి యిట్లంటిని. 'అయ్యా! నీపరిశోధనమున నీ కొక్కనికే ప్రాణము మీఁదికి వచ్చునెడల నెట్టయిన సహింపవచ్చును. అందువలన నాకు, నీపరిషత్తునకుఁ గూడ ప్రాణము మీఁదికి వచ్చునప్పడు సహింపదగదు. చావునకు నీవలె నందఱు తెగించి యున్నారని యనుకొనఁదగ" దని బలుకఁగ నాతం డిట్టనియెను.

తొందర లేదు. ఈవిమర్శన యంతయపాయకరము కాదు. ఏలయ్యయను పేరుగల