పుట:SaakshiPartIII.djvu/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హస్తిని" అని శ్రీకృష్ణదేవులానతిచ్చినారు. బ్రహ్మజ్ఞానసంపన్నుఁడైన బ్రాహ్మణునికిని, నీచజంతు వైన కుక్కకును, దానిని దినుజండాలునకును బరమార్ధమున భేదము లేదని చెప్పినారు. అట్టిభేదముఁ జేయువాఁడు కుక్కకంటె నధముడు కాఁడా? కాలిక్రింద బ్రాఁకు చీమకును, గగనమున వెలుఁగొందు సూర్యునకును దత్త్వమున నెంతమాత్రము భేదము లేదని బుద్దదేవుఁ డానతిచ్చినాఁడు. ద్విజడైన సరే, చండాలుడైనను సరే యెవ్వఁడు జ్ఞానసంపన్నుఁడో వాఁడే నాకు గురుఁడని శంకరాచార్యులు సెలవిచ్చినారు.

ఇక చిత్రమైన సంగతి చెప్పెదను. పెరియనంబియు మార్నేరు నంబియు నను నిద్దఱు యామునాచార్యుల వారియొద్ద జదువుకొనినారు. మార్నేరునంబి పంచముఁడు- పెరియ నంబి బ్రాహ్మణుఁడు. ఇట్లుండఁ గొంతకాలమునకు మార్నేరునంబి కవసాన సమయము సిద్దించినది. అప్పడాయన పెరియనంబిగారి కిట్టు వార్తనంపినారు. యామునాచార్యభగవా నునక శేషత్వ మొందిన యీతనువును బ్రాకృతులు మట్టిలోగలుపుటకు నేనిష్టపడను. దేవరవారు నన్నుఁ గరుణించి నా యంత్య సంస్కారముల లాచరింపవలయు నని కోరు చున్నా నని వార్త నంపెను. ఆహాహా! ఇది యెంత యాశ్చర్యకరమైన విషయమో! వైష్ణవో త్తముడై బ్రహ్మజ్ఞానసంపన్నుఁ డైన యామునాచార్యశిఖామణి యేమి! ఒక పాదమునొద్ద బ్రాహ్మణుని, నొకపాదమువద్ద బంచముని గూరుచుండ బెట్టుకొని విద్యను బోధించుట యేమి! ఆహా! ఇది యిప్పడెంత విశేషాంశము! పొట్టపిందెవలె వంకరటింకరలు వోయినమన బుద్దులకు దేశమహాప్రారబ్దముచేత దిగజాఱి దిగజాఱి నేలములగ చెట్టునకు నిచ్చెన వేయవల సివచ్చిన మనబుద్దులకు-సర్వజాతి సామ్యము సర్వజనసోదరత్వము, స్వార్థపరతాశూన్యత, భూతదయయు జిరకాలపు బానిసతనముచేత నంతరించిపోయిన మనబుద్దులకు ఈయం శము విశేషాంశముగఁగనబడదా! యామునాచార్యులవారు మార్నేరునంబిగారికి బాలబో ధము చెప్పినారా? బ్రహ్మసూత్రభాష్యము బోధించినారు. ఆనంద వాచకపుస్తకము చెప్పి నారా! ఆత్మజిజ్ఞాసాశాస్త్ర ముపదేశించినారే. ఇది యప్పటిదినములలో సామాన్యవిషయమే.

అప్పటిస్థితికి నిప్పటిస్థితికి నెంత యేతపుబెట్టుగా నున్నదో చెప్పవలయునా? మహాగౌరవముతో వంశపారంపర్యముగఁ బోషింపబడుచున్న వైదిక విద్యాంసుఁడు తన మహారాజునొద్దసైత మొక్క వేదవాక్యమైన వచింపఁడే జపతపములులేని చదువు సందెలులేని మంచిచెడ్డలులేని ముండమోపి మిండడైన యేబాపనశుంఠ నైనను దగ్గఱఁ బెట్టుకొని యానిర్భాగ్యుని మొగము చూచుచు మహారాజు నొద్దవేదము వచించునే! ఆహా! ఇది యెంతదారుణము. వీని వైదికపాండిత్యము మండిపోను! శూద్రుడు వేదము వినఁగూడదా? ఆతడు తరింపఁదగదా? ఇతడేనా పండితుడు. ఇతడేనా ప్రాజ్ఞఁడు. " ఓ బ్రాహ్మణుఁడా నీవే యపండితుడవు. నీవే పనికిమాలినవాడవు. నీవే తరింపఁదగినవాడవు. నీవే శాశ్వత శిక్షార్హుడవు. నీలో నున్న వేదజ్ఞానమందలి గౌరవముచేత నిన్నుఁ బోషించుచున్న మహారాజే బ్రాహ్మణుఁడు. అతఁడే వైదికవిద్వాంసుఁడు. అతడే తరించువాఁడు" అని యనఁదగదా?

మార్నేరునంబి కోరికపై బెరియనంబి వచ్చి యాతనికి నమస్కరించెను. అప్పడు పంచముఁ డిట్టు పలికెను. “నేను దైవనామస్మరణ మొనర్చుకొనుచు మరణించునెడల నీవు నాకు బదిదినములు మైలపట్టి యుత్తరక్రియ ల్నర్పవలయును. ఆచార్యవర్యుని స్మరించుకొనుచు మరణించునెడల నొక్కదినము మాత్రమే మైలపట్టవలయును. నే నెవరిని స్మరింప