కుండ, నేతలఁపు లేకుండ, నిర్మనస్కముగ మరణించునెడల నీవు నాకొఱకు మైలపట్టు నక్కఱలేదు. అగ్నిసంస్కారము మాత్ర మొనర్చిపొమ్ము' అని చెప్పెను. బ్రాహ్మణుడేమి? పంచమునకేమి అశుచి పట్టుట యేమి? ఔర్డ్వదైహికక్రియ లాచరించుట యేమి? ఆహా! ఎంతవింత! తల్లిదండ్రులకు సోదులకుఁ జేసినట్టే పంచమునకు బ్రాహ్మణుడంత్యక్రి యలు చేయుటయే! సర్వజనభ్రాతృత్వ మనుసంగతి మనకుదెలియును. వారికిఁ దెలి యును. వారి కాచరణములో నున్నది. మనకు లేదు అదియే భేదము. తెలిసినవాఁడు విద్వాంసుడు కాడు. తెలిసి నట్టాచరించువాఁడే ఘనుఁడు. పెరియనంబి మార్నేరునంబికి బ్రహ్మమేధ సంస్కార మొనర్చి స్నానమైనఁ జేయకుండ, బట్టలైన మార్పకుండ, తిర్వారా ధాన కానిచ్చుకొని భుజించినాడు. ఏశవమునైనను ముట్టుకొన్న పిమ్మట స్నానము చేయవలసి యుండంగా పంచమశవమును దాకియాతండు స్నానము చేయలేదు. ఆశ్చర్యకరము! భగవద్భక్తునియం దున్నమహిమము! -
ఇందువలన నేమి తెలియదగిన దనంగా:- పూర్వమహానుభావు లందఱుకూడ బంచ ములను స్పృశించి స్పృశించితి మని సంతోషించి కృతార్డులైనారు. అందుచే నస్పృశ్యత మనునది చండాలత్వములో లేదు. భగవద్భక్తుఁడైన చండాలుడు పూజ్యండే. విద్య గలచండాలుడు పూజ్యడే. పరమార్థజ్ఞానాభావుఁడైన బ్రాహ్మణుడే యస్పృశ్యుడు.
అట్టి పూజ్యులైన చండాలు రిప్ప డెక్కడ నున్నారని బుద్దిహీనమైన ప్రశ్నము వలదు. అట్టి చండాలురు లేరు. పెరియనంబి వంకరాచార్యులవంటి బ్రాహ్మణులు లేరు. కాని మీ మొగములకుఁ దగిన చండాలు రిప్పడున్నారు కాదా. మీరు వారి కే మొనర్చినారు?
అదిగాక బుద్దుని జంపుటు కలవకుఁడు, నంగినమూలు డని యిద్దలస్పృశ్యలు వచ్చినారు. ఒకడు నరఘాతకుఁడు. ఒకడు నరమాంస భక్షకుడు. ఇద్దలు కలసి బుద్దదేవు రూపుమాపుటకు వచ్చినారు. దేవతాతేజస్సుతోఁ బ్రకాశించుచున్న దివ్యమంగళవిగ్రహ మును గాంచి తెల్లబోయినారు. ప్రేమావతార మగు బుద్దదేవుఁడు వారిని గౌగిలించుకొని చెఱియొక తోడపైఁ గూరుచుండం బెట్టుకొని నీతిని బోధించి వారిని బుద్దమతావలంబకులుగఁ జేసినాఁడు. పన్నిద్దలాళ్వారులలో నొకండు పంచముఁడు. ఇందువ లన యోగ్యతయే ప్రధానము కాని మఱియొకటి కాదు. చండాలు నస్పృశ్యునిగా మనపూర్వులు భావింపలేదు. బ్రాహ్మణుఁడెవండో చండాలుఁ డెవండో బుద్దుడు చేసినవిభాగమును గూర్చిన పద్యములు నాల్గు వినదగినవి.
కాని యవి బుద్దనాటకములో నుండుటచే నిట వ్రాయలేదు.
ఇప్పడు మనల మనము గాఢముగాఁ బరిశీలించుకొన్నయెడల మనకున్న బ్రాహ్మ ణత్వమేమో మనకుఁ దెలియును. మనకు వేదాధ్యయన మున్నదా? స్మృతులను శాస్త్రము లను జదివితిమా? పురాణములు బూతులని మానివైచిన వారెవరు? పూర్వ బ్రాహ్మణాచార ములైనఁ జేయుచుంటిమా? ఏకారణముచేత మనము ఘనుల మని చండాలురు నీచు లని మనము చెప్పఁగలము? యథార్థ మాలోచింపఁగ జ్ఞానశూన్యుల మైన మనమే యస్పృశ్యుల మేల కాము?
మన పూర్వాచారము లెన్ని నశించిపోయినవి? సహగమన మిప్పడున్నదా?