నేను శుత్రు లెఱింగిన వాఁడను కాను. స్మృతు లెఱుంగను. శాస్త్రములు చదువలేదు. (ఏమియుఁ జేతకాని వాడవుకదా, నీ కుపన్యాస మేల నోరు మూసికొని యుండలేకపోయి నావా అని సభలో గేకలు) ఈకాలమున నస్పృశ్యతను గూర్చి యందఱు చెప్పచుండఁగా నాకుగూడ బుద్ది పుట్టినది. (అంటరానితన మంటురోగమటయ్యా అని సభలో గేకలు) ప్రపంచమున నితరజాతు లన్నియు వారివారి వర్తక వ్యాపారములు, వ్యావహారికధర్మములు, రాజకీయ తంత్రములు, కళాభివృద్దిమార్గములు, ధనసంపాదనతంత్రములు నిర్వహించుకొ నుచుండఁగా మన మేమి చేయుచున్నాము? మన విద్యలను బైవారి కంటగట్టి, మన ధనమును బరులయొడిలోఁ బోసి, మన యాధిక్యమును మన్ను చేసికొని, మన ప్రభుత్వ మును బానిసతనము క్రింద మార్చుకొని, మనుష్య స్వరూపములతో మాత్రమే చచ్చినకంటె నెక్కువ హీనపు బ్రదుకును బ్రదుకుచు నీ యధమత్వములో నీయధమాధమత్వములో నీకంటె నే నెక్కువ యని నేను మడి యని నిన్ను మట్టుకొనిన నేనొడలు గోయించు కొనవలె వని, నేను మోక్షార్హుండ నని నీవు చెప్పరానివాడ వనియు, నితరజాతులు వినిపోదురేమో యని సిగ్గుబిడియములులేక, మానాభిమానములు మంటబెట్టి సభలలో వాదించుకొనుచున్నాము. పత్రికలలోఁ బ్రచురించుకొను చున్నాము. అన్నియుఁ బేండలోని పురుగులే యైనప్పడు, ప్రక్కనున్న పురుగుకంటె బైనున్న పురుగు ఘనత, గౌరవము, ప్రశస్త్యము, పరమయోగ్యత, యధికము లనవచ్చునా? అజ్ఞతములైన యర్చకులు సైతము నిట్టి యవాచ్య చర్యల కధీను లగుదురా?
అప్పృశ్యత, చెప్పరానితనము-ఈస్టితిమాత్రము ప్రపంచమందున్న దేశములలో నొక్క భారతదేశమునందు మాత్ర మున్నది. అమెరికాదేశస్థులుఁ నీగ్రోల నిట్లు హీనముగాఁ జూచుచున్నారని చెప్పదురు. కాని యింత పాపము, యింత ఘోరత, యింత మూర్బత, యింత క్రౌర్యము మనదేశమందే తక్క మఱి యొచ్చటను లేవు. అంటరాని తనము చెప్పరానితనము నను నీ రెండు మాటలు నొక్క భారతదేశ సారస్వతమునందే యున్నవి. ప్రబలమైన మన యజ్ఞానమున కివి ప్రచండ నిదర్శనములై యున్నవి. భారతీయుల మనస్సులలో నున్న రెండు కన్నులలోను నివియే రెండు పూవులైయున్నవి.
మనపూర్వు లెట్టివారో, మనదేశ మెట్టిదో యీ సందర్భమున రవంత చూచు కొనవల సియున్నది కాదా? లోకమున కంతకును జ్ఞానతేజస్సును ప్రసాదించినవారు మనపూర్వులు. తత్త్వజ్ఞానని శ్రేణికపై మనవా రెక్కిన యెత్తువఱకుఁ దల లెత్తిచూడలేక కన్నులు దిరిగిపోవం బాశ్చాత్యతాత్త్విక విద్వాంసులా నిచ్చెన యడుగు మెట్టదగ్గఱఁ గూల బడియున్నారు. ఒక్కకళయందు గాదు, ఒక్కశాస్త్రమందుఁ గాదు. అన్నిటియందు గూడ మన పూర్వులు పరమావధియైన పరమార్ధమును గనుఁగొనివారు. అత్యంత తపోనిష్టాగరిష్టతచే మనపూర్వు లగ్ని తేజస్సుతోఁ బ్రకాశించెడివా రగుటచేత వారంటరాని వారని చెప్పవ చ్చును. వారియోగ్యతను గూర్చి చెప్పినతరువాత, నానోటితోడనే యితర జాతులను గూర్చి చెప్పఁగూడదు. కావున వారు చెప్పరానివారైరి. అంటరాని చెప్పరాని మాటల కర్ణ మిది కాని మeటియొకటి కాదు.
అట్టివారి సంతతివార మైన మన మిప్ప డెట్లున్నాము? ఒకరు చెప్పనేల? మనకే తెలియును? లోకమున కంతకంటెఁ దెలియును. ‘విద్యావినయసంపన్నే బ్రాహ్మణేగని