పుట:Rubayat.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

తెరను వైచెను, తోలుబొమ్మలు
బఱచి యాడిపంగఁ దొడంగెను
త్వరగ నొక్కటి యొక్కటేకొని

తీయఁగాఁ దొడఁగెన్

పరమమాంత్రికు డతఁడు బొమ్మలఁ
బఱచి యాడఁగఁజేసె మనలను
కరమునను దీపంబుఁబట్టి వి

చిత్రగతు లొప్పన్


69



లోకమిది చతురంగ ఫలకము,
చీకటియు వెలుతురును గడులగు
వీఁకతో జతురంగ బలమౌ

మనల నాడించున్

సాకుచును నడిపించు నొక్కట
వే కదల్చుచుఁ ద్రోసిరాజును
వ్రేకదనమున నొక్కయప్పుడు

చంపి బరిణెనిడున్
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/41&oldid=322244" నుండి వెలికితీశారు