పుట:Rubayat.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70


బంతిఁబోలెడి నిన్ను లోకపు
వింతబయటను స్వారిచేయుచు
బంతియాటను త్రిప్పుచుండును

కర్మదండముతోన్

ఇంతయును నేమంచు నీవును
వింతగాఁ జూడంగ వలవదు
అంతయును నాతనికె తెలియును

అతనికే తెలియున్ ,


71


ఆ లలాటమునందు నాతఁడు
లీలవ్రాసెడి వ్రాతఁ నట్లే
కేల వ్రాయుచుఁ బోవుచుండును

ఆగఁ డొకయపుడు.

ఏలభక్తియు నేలయుక్తియు
నేల యీ కన్నీటిధారలు
చాలునే యావ్రాఁత నించుక

యేని తప్పింపన్.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/42&oldid=322245" నుండి వెలికితీశారు