పుట:Rubayat.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

నే నొకప్పు డగమ్యగోచర
మైనదారిని నాత్మనంపుచుఁ
బూని యవ్వలివార్త నించుక

తెమ్మనుచు నంటిన్

గాని యదియును బోయి శీఘ్రమె
కానవచ్చియు నాదుమ్రోలను
'నేనె స్వర్గము, నేనేనరకమ'

నంచు వాక్రుచ్చెన్


67



ఆశలే పరిపూర్తినొందుచు
నాశలే విఘ్నంబునొందుచు
నాశ పెట్టుచు దుఃఖపెట్టుచు

స్వర్గనరకము లౌ;

ఆశ కనఁబడనట్టి చీఁకటి
దేశమేకద మొదటి వసతి, స్వ
దేశమునకే తిరిగి మఱలెద

మింతయును నిజము.
34
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/40&oldid=322243" నుండి వెలికితీశారు