పుట:Rubayat.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

ఒక్కపరి ప్రచ్ఛన్నవృత్తిని
చక్కఁజూపవు ముఖము నేరికి
నొక్కపరి రూపుంబు లెన్ని యొ

పొంది తోఁచెదవు;

నిక్క మేమో తెలియకున్నది
యిక్కధయు నీవలననే కద
నిక్కముగ ద్రష్టవ్యుఁడవు మఱి

ద్రష్టవును నీవే.


53


జీవమందలి మూలమర్మము
లీవునిచ్చటఁ దెలియఁగల్గినఁ
జావునొందుచు నీశ్వరుని మ

ర్మములు తెలిసెదవు.

నీవు నీతోనున్న నేఁడే
యేవియైనను దెలియనప్పుడు
నీవు నీతో లేని 'ఱేపట

నేమి తెలిసెదవు?
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/33&oldid=322211" నుండి వెలికితీశారు