పుట:Rubayat.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



50

అయ్యొ! తలవెంట్రుకయె వాసిగ
చెయ్యిఁదప్పెడు సత్య; మదియును
అయ్యొ! యొకయక్కరమె తెలియక

వెదకెదమొ యేమో,

అయ్యదియుఁ దెలియంగవచ్చినఁ
దియ్యమున ధనగోశమే కా
దొయ్యనను దత్ప్రభువుఁ గూడను

కనఁబడునొ యేమో!


51


అతి నిగూఢముగాఁగఁ దిరిగెడు
నతఁడు చంద్రుని మొదలు చేపల
వితముగా నెన్నెన్నొ రూపులఁ

బట్టఁబోయినను,

వెతలఁబడి యాయాసమొందిన
సతఁడు చంచలుఁడగుచు పారద
గతిని దప్పెడు; నన్ని మడియును

శాశ్వతుం డతఁడే,

26
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/32&oldid=322116" నుండి వెలికితీశారు