పుట:Rubayat.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



48

ఒక్క క్షణమె మకాము, మఱి యది
యొక్క పరియె యేడారినూతను
జక్కఁగా జలములను గ్రోలుట

యంతలో నయ్యో!

పక్కనున్న బిడారు ఫూర్వపు
చక్కి లేచు నెడారిలోనికి
జిక్కిపోదువుగాన వేగమె

త్రాగుమీ నీటిన్,


49


ఓయి యీచిత్రంపు జీవము
మాయఁదెలియఁగ నెంతువా మఱి
చేయుమయ్యా యూహ వేగమె

తెలిసెదవొ యేమో.

మాయనున్ సత్యంబును న్మఱి
పాయఁజేయున దొక్క వెంట్రుక
గా యెడము; సంశయమె ప్రాణా

ధారమగును గదా.
25
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/31&oldid=322114" నుండి వెలికితీశారు