పుట:Rubayat.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



46

ఓయి, నీవును నేను లోకముఁ
బాయఁగానె ప్రపంచమంతయు
నాయెనంచును దలఁపఁబోకు మ

దెట్ల జరుగు సుమీ.

పోయమానఁడు మద్య పాత్రను
చేయిచేర్చి యన తసాక్షి యు
పాయుమొప్ప ననంత సంఖ్యల

జీవబిందువులన్


47



తెరను దించుక యవలమనమును
జరిగిపోయిన నేమి? చిరముగ
ఒరుగుచుండును లోక మిట్లే

లోటు లేదయ్యా.

అరుగు దేరక వూర్వమైనను
గలిగెనే లోటింతదానికి
పరగునే నీపేరు గీర్తియు

నిచట నెల్లపుడున్
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/30&oldid=322110" నుండి వెలికితీశారు