పుట:Rubayat.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



54

చిల్లిగవ్వయుఁ జేయఁజాలని
బొల్లివాదములేల? కాలము
చల్లగాను గతించుచున్న దిఁ

కేల జూచెదవు?

ఉల్లమం దుత్సాహమూనుచు
కొల్లగా నీద్రాక్షరసమున
నెల్ల పరితాపముల మఱచుచు

హాయిఁ బూనవయా!


55


గొడ్డుభార్యను నేలికొంచును
బిడ్డలను గనకుండ వంశము
నెడ్డెతనమున నంతరింపఁగఁ

జేయనొప్పునోకో.

గొడ్డుబుద్ధిని మోదటి భార్యను
మెడ్డివేసి విడాకులిచ్చితి
లడ్డువా యీ ద్రాక్షకన్యను

పెండ్లియాడితిని.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/34&oldid=322213" నుండి వెలికితీశారు