పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

బాలతనుకాంతితో సాటి పోలఁ గోరి, పృథ్వి ననలప్రవేశంబు పెక్కుమాఱ్లు
చేసి యెఱపులఁబడెఁ గాని వీస మైనఁ, బోలఁగాఁ జాలదయ్యె జాంబూనదంబు.

105


సీ.

వ్యాళము ల్దల వంచి, నేలఁ జాగిలఁబడెఁ, బూని నీలపురాలు పూరిఁ గఱచె
నద్రులు పాదంబులాడక పడియుండె, వాలెంబు నేనుఁగుల్ గేలు మోడ్చె
బెదరి చూచుచు లేళ్లు చెదరి పాఱఁ దొడంగె, నీరజంబులు లోతునీటఁ బడియెఁ
గోయిలమూఁకలు గొదకొని చె ట్టెక్కె, సింగముల్ గుహల నడంగి డాఁగె


తే.

నవనినాయక నిఖిలలోకాద్భుతాభి, నవవిలాసవిభాసమున్నతిఁ దనర్చు
కలికిరోమాళికచకుచగమననయన, ముఖవచోమధ్యములతోడ మొనసి యోడి.

106


మ.

పలుగు ల్వేయు నిఁకేల భూరమణ యాబంగారు ల్బొమ్మ యా
వలికప్రంపుటనంటిక్రొమ్మొలక యావాల్గంటి యాశ్యామ యా
యలివేణీజనచూళికాభరణ మయ్యంభోజపత్రాక్షి యా
తలిరుంబ్రాయపుఁగల్కిరాచిలుక యాతన్వంగి నీకే తగున్.

107


క.

అని సంగడికాఁ డెఱిఁగిం, చిన విని యత్యంతముదితచిత్తుం డగుచున్
జనవరుఁ డటఁ దరలి రయం, బునఁ జనియె వధూటిఁ జూచుబులు పెదఁ బొదలన్.

108


క.

చని చని వని వనితం బెనఁ, కొన మోహం బంతకంతకు న్మనమున నూ
ల్కొన నజ్జనపతి సఖునిం, గనులొని యి ట్లనియె నర్మగర్భము గాఁగన్.

109


చ.

కనుఁగొను సంగడీఁడ వనకన్యకుఁ గాలభుజంగుఁ డిడ్డనూ
తననఖరేఖలో యనఁగఁ దద్దయు మోదుగమొగ్గ లొప్పెడిన్
జనవర నీవు నవ్వికచసారసలోచనగుబ్బదోయిపై
దనగునఖాంకురాంకములు దద్దయు నించెదు కూర్మి మీఱఁగన్.

110


తే.

అలరుగుత్తులపై వ్రాలి యదె మరంద, మానుచున్నది మగతేఁటి యనఁగ చూడు
సామి యాలేమకుచగుళుచ్ఛములమీఁద, వ్రాలి కెమ్మోవితేనియ గ్రోలె దీవు.

111


క.

చెలికాఁడ గండుఁగోయిల, నలిఁ గెందలిరాకు గం ట్లొనర్చెడుఁ గంటే
భళిభళి యచ్చెలివాతెఱఁ, బలుగం ట్లొనరించె దీవుఁ బ్రమదమున నృపా.

112


క.

పున్నాగముతోఁ బెనఁకొను, చున్నది లతకూన చూడు మోహో సఖుఁడా
పున్నాగమ నీతో న, చ్చిన్నెలక్రొందీఁగఁబోఁడి చెలిమి బెనంగున్.

113


చ.

పలుమఱు గీరదంపతులు భావభవప్రధనక్రియారతిన్
మెలఁగుచు మింటిదాఁకఁ బొదమిద్దియఁ గేరెడుఁ జూడు నెచ్చెలీ
భళిభళి రాజచంద్ర యల పంకజపత్రవిశాలలోచనం