పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పట్ట నబ్బక రెచ్చి పాఱి జో డెడవాసి, కలఁగెడుకొదమజక్కవలు తులయె
పట్టి నొక్కిన శిలాప్రాయంబు లై నును, గోరు నాటక యుండుకొండ లీడె
పట్టి రాచినయంత బలువన్నియల గరం, గెడు మేటిజాళువాగిండ్లు సరియె


తే.

పట్టఁ బట్టఁగఁ దిరుగుడు పడుచు నుండు, మేలిరతనంపుపలుబొంగరాలు దొరయె
యహహ ధరణీశ యత్తలిరాకుఁబోఁడి, కులుకుసిబ్బెంపువలిగబ్బిగుబ్బకవకు.

94


క.

నీలాహి యనుచుఁ దుమ్మెద, చా లనుచు న్నల్లచీమ చా లనుచు జనుల్
తోలుదురు గాని చెలిరో, మాళి ప్రజ న్గెలుచుమరునియసిధార సుమీ.

95


తే.

చంపకామోదవళుల జయింపఁ బూని, యేటితరగలు పెల్లున నెగసి తద్దఁ
బెరిగి విఱుగుచు నుండె నిద్ధరణిలోన, నరయ జడభావులతెఱంగు లట్ల కావె.

96


క.

సుడివడి కలఁగుచు స్రుక్కెడు, మడుఁగులు చెలి నాభి పోల్ప మాదిరి యగునే
యడవుల బొబ్బలు వెట్టుచు, నడలెడుహరు లింతికౌనునాకృతిఁ గనునే.

97


క.

తరుణీమణిజఘనమునకు, దొర గాక తృణంబు వూని తుద లేక వసుం
ధర యొడితొడుగులఁ బడి మహి, దరములు చుట్టుపడి తావు దరలక యుండెన్.

98


తే.

పొలఁతియూరుద్వయంబుతోఁ బోరి మున్ను, గెల్పు గొన లేక పొర యూని దళము లెలయఁ
గాచి యుండియు గెలఁ జేవ గలుగకుంట, నంటులకు నెల్లఁ దలవంపు లయ్యెఁ జుమ్మి.

99


క.

లలనామణిపిఱుఁదులతోఁ, దుల యగుభ్రమ నుఱుక దిరుగఁ దొడఁగె రథాంగం
బులు మఱియుఁ గుప్ప వడుచుం, బులినంబులు మెత్తఁబాటుఁ బూనెం జుమ్మీ.

100


తే.

కలమగర్భంబులో మహోత్పలదళాక్షి, పిక్కలకు నోడి తద్దయుఁ బీఁకెపాఱి
వెన్ను చూపి తృణం బూని యెన్నరాని, నానఁ దలవంచుచుండె ననారతంబు.

101


తే.

పొలఁతిమీఁగాళ్లతో నెనఁ బోలలేని, మోస మొదవిన వంతులు మునిఁగి మునిఁగి
మాటిమాటికి మేటితాఁబేటిదాఁటు, గుట్టు చెడి పొట్టలోఁ దలఁ గ్రుక్కుకొనియె.

102


చ.

రమణిపదద్వయంబుసరి రా నెదఁ గోరి యనేకకల్పముల్
కమలము కంఠగాత్రగత గాఁగ జలంబుల నర్కువేఁడి యం
దమితవిభాసుగంధమృదుతామలతల్ కమలాకరత్వముం
గమలభవాస్పదత్వమును గాంచి తదంఘ్రులఁ బోల దింతయున్.

103


తే.

జలరుహేక్షణపదనఖంబులను బోలఁ, జాల కెంతయు రిక్కచా ల్బేలపడియెఁ
గరనఖములకుఁ గేతకీగర్భదళము, లోడి కంటకభావంబు వీడ కుండె.

104