పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఘన మొకతఱి నొక్కొకది, క్కున వృష్టి యొనర్చుఁ గాని కోమలి తుఱుమన్
ఘనము ఘన మగుచు నెల్లెడఁ, గొనకొని శృంగారరసము గురియు నృపాలా.

82


తే.

ఉవిద నెమ్మోముదమ్మికి నోడి స్రుక్కి, తద్విరోధంబు సాధింపఁ దలఁచెఁ గాక
జనులకెల్లను గడుఁ జల్లఁందనముఁ జూపు, తొగలఱేఁ డబ్జముల కేల పగతుఁ డయ్యె.

83


క.

అంగన కన్బొమకవతో, సింగిణు లెదిరించి గెలుపు చేకుఱ కవనిన్
వంగి శర మూని కడు నా, ర్తిం గొఱలుచు నుండెఁ జుమ్ము నృపకులతిలకా.

84


క.

అచ్చాననాసతోడను, ఱిచ్చపడక మొనసి తుదిని ఱే కత్తి వడిన్
విచ్చెం జంపకముకుళము, చెచ్చెర మఱి నువ్వుఁబువ్వు స్నేహం బూసెన్.

85


క.

అప్పొలఁతికన్నులందము, తప్పక కన్గొనుచు నుండి తగ బేడిసమీ
లెప్పుడు నత్తెఱఁ గలవడ, ఱెప్పలు మోడుపక యుండె ఱేపు న్మాపున్.

86


తే.

మీలు మే లోర్వ లే కెంత మిట్టిపడిన, నేణము ల్త్రాణమై నెంత యెగిరిపడినఁ
దూపు లేపార నిల నెంత తూలిపడినఁ, జెలువనిడువాలుచూపుల గెలువఁగలవె.

87


క.

మఱి మఱియుఁ దోమి తోమియు, మెఱుఁ గిడక వెలుంగ కుండు మృదుదర్పణముల్
తెఱవనునుఁచెక్కుఁగవ కె, త్తెఱఁగున నెన వచ్చు వసుమతీవరచంద్రా.

88


క.

తామరసనేత్రవీనులతో మొనసి జయింపలేక త్రొక్కటమున నెం
తే మలకలఁ బడి స్రుక్కుచు, నేమఱు శష్కులులు గ్రాఁగి వేఁగుచునండున్.

89


సీ.

ననఁబోఁడియధరంబునకు సాటి గా కేమొ, బంధుజీవకము నిగ్గరధ మయ్యెఁ
దెఱవమెఱుంగువాతెఱ కుద్ది గా కేమొ, కురువిందమణి త్రాసగుణము పూనెఁ
బొలఁతిరదచ్ఛదంబున కెన గా కేమొ, కఱు కూని చిగురాకు కారు పాఱె
శుకవాణిముద్దుమోవికి జోక గా కేమొ, సడలి బింబఫలంబు చప్పఁబడియె


తే.

నంబుజేక్షణచక్కెరకెంబెదవికి, నీడు గా కేమొ విద్రుమం బెల్ల ప్రొద్దు
మ్రానుపడి యుండె నయ్యారె మాట లేటి, కన్ను దలమిన్నసోయగం బెన్న నరిది.

90


క.

చిగురాకుఁబోఁడినునుఁగ్రొం, జిగిబిగిపలుచాల్పు దొడరి సేమంబున గె
ల్పు కొనం జాలక యెపుడును, మగరా ల్జగడాలు పూని మట్టం గ్రాలెన్.

91


తే.

లేమగళమున కుద్దిగా లేక యోడి, సుడివడుచు లోన బిగి చెడి యడుగు వట్టి
దగము దరమూని మొద సేయ దాని కిపు డు, దర మనెడుపేరు విడువక తవిలియుండె.

92


తే.

రతిమనోభవకేలి కారామసీమఁ, బొదలునవచూతలతలు గాఁబోలు దాని
బాహులత లట్లు గా కున్న బాణిపల్ల, వములు రాజిల నేర్చునే వానితుదల.

93


సీ.

పట్టినప్పుడె కంది పస దప్పి కడుమెత్తఁ, బా టూనుక్రొన్ననబంతు లెనయె