పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నగవుఁజూ పలవడ్డ సొగసుఁగ్రొన్న నచెండు, చేష్ట లబ్బి మెలంగుచిత్రరేఖ


తే.

గావలయు నియ్యబల దీనిగాఢకాంతి, రూపలావణ్యశుభవైఖరులు గరంబు
నమ్మహారాజునకుఁ దెల్పి యతిరయంబ, తోడుకొని వత్తు నని వేడ్కతోడ మరలె.

69


తే.

మరలి చనుదెంచి యమ్మహీవరుని గాంచి, యంచితాలాపముల నిట్టులంచుఁ బలికె
భూతలాధీశ నీయాజ్ఞఁ బూని యిందుఁ, దరలి యొకయబ్బురపుఁద్రోవ నరిగి యవల.

70


సీ.

పటికంపుదోనులఁ బరఁగుగొజ్జంగపూ, నీటిబల్జక్కర ల్దాఁటి దాఁటి
గుప్పుగుప్పునఁ దావు లుప్పతిల్లఁగఁ ద్రోవ, నెలయుకప్రపుఁదిప్ప లెక్కి యెక్కి
గాటంపునెఱపూఁతకమ్మసంపఁగిచెట్ల, నీడల నంతంత నిలిచి నిలిచి
యల్లబిల్లిగఁ బ్రాఁకి యెల్లతావుల బెల్లు, మీఱునేలకిపొద ల్దూఱి తూఱి


తే.

తెమ్మ గ్రమ్మఁగఁ గడు నెడతెగక కురియు, నరిది విరిదేనెసోనలఁ బొరసి పొరసి
యొఱపులకు నెల్ల నిక్క యై వఱలునొక్క, మేటిచెలువంపువలిపువ్వుఁదోఁటఁ గంటి.

71


సీ.

రామనామస్తుతిఁ గ్రాలి ఫలాహార, వృత్తిఁ జరించుశుకేంద్రములును
నీలకంఠాకృతి నెఱపుచు నానంద, తాండవం బాడుచంద్రకిచయంబు
నమృతాశయంబునఁ గమలజాన్వేషణే, చ్ఛం జెలంగుపరమహంసవ్రజంబు
వనములఁ బడి మాధవప్రసాదముఁ గోరు, కృష్ణవేషద్విజబృందములును


తే.

సతతవివిధాగమాంతవాసనలవలన, నాద మెఱిఁగి నిరంతరామోదలీల
నలరుసిద్ధాళులును గల్గి యవ్వనంబు, గనుఁగొనఁగ నబ్ర మొదవించుఁ గద నృపాల.

72


క.

ఆలీలావనమున ఘన, హేలామార్గమునఁ జెలఁగి యిమ్ముగ సుమనః
కేలీరతి నలరారెడు, బాలారత్నములఁ గంటి భావజరూపా.

73


ఉ.

ఆమహిళాలలామములయందు రహిం బొడగంటి దివ్యశో
భామృదుతాసుగంధపరిభాసితరూపవిలాసలీలలన్
వేమఱు గోము మీఱి యరవిందశరాసనుచే వెలుంగుక్రొ
మ్మామిడిపండువంటియొకమత్తమతంగజరాజగామినిన్.

74


ఉ.

ఆయెలనాగసోయగ మయారె గణింప నొకించుకైన న
త్తోయజసూతిసృష్టిఁ గలతోయరుహాననలందుఁ జెంద ద
క్కాయజుఁ డబ్బురంబుగ జగంబులు గెల్వఁగ నేర్చి యిడ్డనున్
జాయకటారి గావలయుఁ జామ నిఁ కేమని యెంతు భూవరా.

75