పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వేమఱు మది కింపుగ గజ, గామిను లామనిగఁ బాడుగానము వినుచున్
సోమరితనమునఁ దడయక, సేమంబున మరలి యిపుడె చెచ్చెర రమ్మా.

62


ఉ.

నావుడుఁ జెల్మికాఁడు నృపనందను వీడ్కొని వేడ్క నేగి శో
భావహలీలఁ గ్రాలునొకయబ్బురపుంబువుఁదోఁటఁ జొచ్చి య
త్తావునఁ బ్రోవు గూడి వితతంబుగఁ గ్రీడ యెనర్చుదివ్యరా
జీవముఖీలలామములఁ జిత్రగతిఁ బొడగాంచి వెండియున్.

63


మ.

తరుమూలంబులపొంతఁ బొంచి సచినోత్తంసంబు వీక్షించె భా
స్వరకార్తస్వరవిగ్రహ న్సమదచంచచ్చంచరీకాలకన్
శరదిందుప్రతిమానచంద్రవదనం జక్రస్తని న్విస్ఫుర
త్సరసీజాతదళాయతాక్షి నొకకాంతాలోకచూడామణిన్.

64


తే.

అట్లు వీక్షించి దానిసమగ్రభువన, మోహనాకారరేఖ కామోద మంది
యహహ యియ్యిందువదన యయ్యసమశరుని, భూరిసామ్రాజ్యలక్ష్మి గాఁబోలు భళిర.

65


చ.

కులుకుమిటారిగుబ్బలును గొప్పపిఱుందును గావిమోవియుం
దెలినిడువాలుఁగన్నులును నిద్దపుముద్దుమొగంబు తళ్కుఁజె
క్కులు జిలుఁగుంగవు న్వెడఁద, క్రొమ్ముడియుం గలయీచొకారపుం
గలికియలంతిజవ్వనము కన్నులపండువ యయ్యె నియ్యెడన్.

66


క.

చూడమె ముజ్జగములఁ గల, చేడియతలమానికములఁ జె న్నలరెడునీ
వ్రీడావతీకదంబక, చూడామణివంటిదానిఁ జూడ మొకందున్.

67


సీ.

చందమామకు లోనఁ గం దొనర్చినతప్పు, పసిఁడికి దావిఁ గూర్పనికొఱంత
దొండపంటికిఁ దీపి నిండఁ జేయనిరట్టు, తొగలఁ బెన్మడుగునఁ ద్రోచువాదు
జక్కవపులుఁగుల జత విప్పునాడిక, మించుటద్దముల మాయించుకీడు
కరితుండములకు వక్రత యిడ్డ నేరమి, చివురులు గార్కొనఁ జేయురవ్వ


తే.

మలుపుకొనఁ జాలు నద్దిరా జలజభవుఁడు, పూని యిమ్ముద్దుతలిరాకుఁబోఁడివదన
నురదాంశుక’లోచనస్తనకపోల, సక్థిపదయుగ్మకము సొం పెసఁగ నొనర్చి.

68


సీ.

పలుకులు నేర్చిన తళుకుఁబుత్తబొమ్మ, జగతికి డిగ్గిన చంద్రరేఖ
నిలుకడఁ గాంచిన'తొలుకరిక్రొమ్మించు; తావి చేకుఱిననెత్తమ్మికెంపు
నెన్నడు పొదవినకన్నెమామిడిగున్న, తను వూని మెలఁగుకెందమ్మికొలను