పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్గిరిచాపా హరిరోపా, పరితాపాహరణ నిన్నె ప్రణుతింతు శివా.

53


వ.

అని మఱియును.

54

కందమణిగణనికరవృత్తము

జయజయ పురహర జయ గిరిశయనా, జయ తలవినిభృతసదమలహరిణా
నయగుణవిలసిత నయశుభచయదా, జయ మునివరనుతచరణసరసిజా.

55

సగర్భస్రగ్విణీభుజంగప్రయాతద్రుతవిలంబితవృత్తసీసము

సీ.

నిగమాశ్వభూసురానీకసంపూజ్యశుం, భత్ప్రభావా వృషపతితురంగ
సురుచికద్యోసరిజ్జూట ఖద్యోతసా, హస్రభాసా సమస్తాఘహరణ
జగతీశ మాసరస్పత్యుఘామాన్యచం, చత్కృపా నతజనశరణ్య
మానితహాసరమ్యాననాబ్జా లస, న్మంగళాత్మా నిశానాథమకుట


తే.

హర సరీసృపహార భయాపహార, పురనిషూదన భూరివిభూతిదాన
హరిహయప్రణతాచ్ఛపదాంబుజాత, శరణు శంకర శాశ్వత సాధుపాల.

56

సగర్భమత్తేభకందసీసము

సీ.

సమదవేదండనిశాచరోన్మథనభీ, మప్రౌఢదోర్విక్రమా కృపాబ్ధి
ప్రముదితానేకసుపర్వ నిర్మలగుణాం, భోధీ జగత్కారణా ధరేశ
లసదురోభాగనిలంబితోరగపతీ, సామప్రియా శంకరా మహాత్మ
ప్రపదరుగ్భూషితపాకజిన్మకుటశుం, భద్రత్నదివ్యప్రభా కపర్ది


తే.

శివ నిఖిలలోకపాలన భవవిదళన, శరధితూణ భయహర విజయ ప్రవిమల
హృదయ శశిధర త్రిభువనహితసుచరిత, శమితపురదితిజవరా ప్రశస్తకీర్తి.

57


క.

అని యనివారితభక్తిం, బ్రణుతించి మహేశుకరుణ వడసి కడున్ గొ
బ్బునఁ బ్రాసాదము వెలువడి, జనవరుఁడు తదంతికమునఁ జనియెడునెడలన్.

58


తే.

సరసవైఖరిశ్రుతిపుటోత్సవము మీఱ, నాలకింపంగఁబడియె నత్యద్భుతముగ
సకలచేతనహృదయరంజకమనోజ్ఞ, మధురసంగీతరావంబు మలసి యెదుట.

59


క.

ఆరవము విని నృప్రాగ్రణి, గారవపుంజెలిమికానిఁ గనుఁగొని యహహా
చేరువ నొకమృదుసంగీ, తారవము వినంగ నయ్యె నల్లదె వింటే.

60


ఉ.

కిన్నరకన్యలో సురమృగీదృశలో గరుడాంబుజాక్షులో
పన్నగకాంతలో ఖతరభామలొ సిద్ధవధబటులో సుఖా
భ్యున్నతిఁ బాడఁ జొచ్చి రటఁ బోయి దిటంబుగ వారిచందముల్
సన్నకసన్న నారసి వెస న్మరలం జనుదెమ్ము నెచ్చెలీ.

61