పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కాలకాలాయ దిక్పాలపాలస్థక, స్తూరికాంకితపదాంభోరుహాయ
దేవదేవాయ రాజీవజన్మోగ్రదు, ర్గర్వనిర్వాపణకారణాయ
మారమారాయ సంసారవార్థినిమగ్న, సేవకోత్తారణనావికాయ
వామవామయ సౌదామనీదామస, మానమానితిజటామండలాయ


తే.

శూలినే భూతకృపాశాలినే సు, శీలినే శశ్వదఘతూలకీలినే క
పాలినే విశ్వలోకైకపాలినే న, మో నమ యటంచుఁ గేల్మోడ్చి మ్రొక్కి మఱియు.

43


సీ.

కరవీరమల్లికాకమలోత్పలములచే, రమణీయబిల్వదళములచేతఁ
గౌశికసామ్రణికాధూపములచేత, ఘనసారచందనాగరులచేత
సహకారకదళికాంచత్ఫలంబులచేత, నవ్యరసాలదండములచేత
మహనీయశర్కరామధురసంబులచేతఁ, బ్రచురహిమాంబుపూరములచేత


తే.

భవ్యగంగావినిర్మలాంభస్సమేత, నారికేళోదకములచేఁ జారువీటి
కా సద్వస్తువితతిచే నాత్మఁ దద్ద, వేడుకలు మౌఱఁ బూజఁ గావించి యంత.

44


క.

వికటాగ్రసంస్థితుం డై, ముకుళితకరకమలుఁ డగుచు మొగి నతఁడు మదిం
బ్రకట మగుభక్తిఁ గందా, ష్టకమున నద్దేవు నిట్లు సంస్తుతి చేసెన్.

45

కందాష్టకము

క.

శ్రీమత్కలధౌతాచల, ధామ సుధాధామతిగ ధామసమీర
వ్యోమాంబుయజ్వపావక, భూమహితాకార నన్నుఁ బోషింపు శివా.

46


క.

శైలసుతాలోల హృతా, భీలకృతాంతావలేప పృథుకరుణాసం
శీలా తతహేలా ధృత, శూలా వ్రతమూల నీకు జోహారు శివా.

47


క.

యతిగణ్యామితపుణ్యా, న్వితఫణ్యాభరణ సతతనిలయీకృతప
ర్వతశృంగా ధృతగంగా, తతశృంగారాంగ నన్ను దయఁ జూడు శివా.

48


క.

నారదదరపారదశర, శారదశరదభ్రకరితుషారాభ్రఝురీ
తారాహీతహీరామృత, ధారాసితదేహ నీకు దండంబు శివా.

49


క.

కాలానలకీలావిల, హాలాహలభయవిచలితహరిదీశమహా
కోలాహలవేళాచల, లీలావిలసనుని నిన్ను లెక్కింతు శివా.

50


క.

హాటకవర ఘోటకపుర, నాటకధరణీమణీభనవ్యాంబరగో
కోటీధనపేటీఘన, చేటీజన మబ్బు నిన్ను సేవింప శివా.

51


క.

భీమా పరభీమా పుర, భామావరకంఠసూత్రభంగ సమంచ
ద్భామాశ్రితవామా హృత,కామా కృతకామ మాకు గతి నీవె శివా.

52


క.

సురదానవవరమానవ, వరమానవమందహాసవదనాబ్జ మరు