పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హృదయాహ్లాదకరీ నమజ్జనమనోభీష్టార్థసంధాయినీ
మది నెల్లప్పుడు సంస్మరింతు నిను నేమం బొప్ప మంచాకినీ.

33


మ.

అవని న్మానవుఁ డెవ్వఁడేని భవదీయాలోలకల్లోలవా
ర్ణవసంసిక్తనిజప్రతీకుఁ డగు నాప్రాజ్ఞుం డమర్త్యేంద్రపూ
ర్ధవళాక్షీకరకంకణక్వణనమిశ్రప్రోల్లసచ్చామరో
ద్భవనిస్తంద్రమరుత్కిశోరములచేతం జొక్కుఁ బో జాహ్నవీ.

34


సీ.

బ్రహ్మహత్యాదిదుర్భరమహాఘవిభంగ, ఘనతరతరళరంగత్తరంగ
విపులసైకతభాగవిలసితచక్రాంగ, హరజటాజూటకూటాగ్రరంగ
కనకారవిందసంగతచలన్మదభృంగ, సూరిజనస్తుతసుప్రసంగ
యమరీకుచాలిప్తహారిద్రసంసంగ, సతతసమాశ్రితశైలశృంగ


తే.

యతిదయాపాంగ పుణ్యమయాంతరంగ, ప్రచురగంభీరనీరాంతరప్రమగ్న
మత్తమాతంగ నీకు నమస్కరింతు, దివ్యశోభాప్రదీప్తాంగ దివిజగంగ.

35


తే.

పరుస మించుక సోఁకి యబ్రముగ నినుము, పసిఁడి యగునట్లు తావకప్రవిమలాంబు
కణ మొకించుక సోఁకిన ఖలజనుండు, మిగులఁ బరిశుద్ధుఁ డగుఁ గదా గగనతటిని.

36


చ.

తమి నొకనాఁడు మానవుఁడు దవ్వులఁ దావకవీచికానినా
దము చెవిఁ గీలుకొల్పిన నతండు వినండు గదా సురాపగా
శమనలులాయకంఠపరిసర్పితభూరితరోగ్రఘంటికా
సముదయలోకభీకరవిశంకటసాంద్రఘణంఘణధ్వనుల్.

37


క.

యోగిజనానందకరీ, యాగమసంస్తుతలసత్సదాంబుజయుగళీ
భోగాపవర్గదాయిని, భాగీరథి నేఁడు ననుఁ గృపం గనుఁగొనవే.

38


క.

ధాతృపితృచరణతలసం, భూతా భువనప్రపూత బుధనుతసుగుణ
వ్రాతా విరజాసలిలో, పేతా నను ధన్యుఁ జేయవే గుహమాతా.

39


వ.

అని యనేకప్రకారంబులం బ్రార్థించి తదంభఃపూరంబునఁ గృతావగాహుం డై సం
ధ్యాద్యనుష్ఠానక్రియాకలాపంబు నిర్వర్తించి తదంతికప్రదేశంబున విహరింపుచుండి
పురోభాగంబున నొక్కచోట.

40


తే.

కనకమణిమయసోపానగర్భగేహ, కుట్టిమాకరమంటపకుడ్యగోపు
రేందుమణిపీఠికాసమన్వితమహేశ, భవన మొక్కటి గాంచె సంభ్రమ మెలర్ప.

41


తే.

కాంచి యద్దేవలము ప్రవేశించి యందు, విమలతేజస్సమగ్రత వెలుఁగుచున్న
దివ్యలింగంబుఁ బొడగాంచి నవ్యభక్తి, యమరఁ గరపంకజాతయుగ్మము మొగిడ్చి.

42