పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

బ్రసవచంపకరథకదంబములు మెఱయ, దర్పకునితోడఁ గూడి చైత్రప్రభుండు
విరహిణీపాంథసందోహవిజయమునకు, హాళి దైవార నపుడు వాహ్యాళి వెడలె.

7


మ.

బలవద్దర్పకవీరకాహళరవప్రాయంబు లై మించి సొం
పలరం బాంథనితంబినీజనఘనస్వాంతంబు లెంతేనియుం
గలఁచె న్బాలరసాలపల్లవలవగ్రాసావలేపోల్లస
త్కలకంఠప్రమదానిరంతరకుహూకారంబు లప్పట్టునన్.

8


క.

మహిళాపున్నాగంబు, ల్రహిఁ గుసుమకదంబలీలఁ గ్రాలఁగ నచ్చో
మహిళాపున్నాగంబు, ల్రహిఁ గుసుమకదంబలీలలం గ్రాలెఁ గడున్.

9


తే.

పవనదుశ్శాసనుఁడు వనీపాండవేయ, లలనజీర్ణచ్ఛదాంశుకంబులు హరింపఁ
గలికిశుకసూక్తిఁ జీరఁ గిసలయహేమ, మయపటము లీఁడె యయ్యెడ మాధవుండు.

10


సీ.

శుకముఖద్విజమండలికి మహాఫలదుఁ డై, తవిలి వేమఱు మరుత్తతి భజింపఁ
గ్రూరపలాశసంహార మొనర్చుచు, సరసను బర్ణలాంఛనము మెఱయ
నాశ్రితాళులు నితాంతామోదమునఁ గ్రాలఁ, జెలఁగి వనప్రియశ్రేణి పొగడ
ఘనతరు ల్సుమనోవికాసలీల నెసంగిఁ, గలితశుభశ్రీప్రకర్ష వెలయ


తే.

సమధికతరాగవహనప్రశస్తి యలర, వనజసాయకగురువైభవంబు నెఱపి
భవ్యవనమాలికాసముద్భాసి యగుచు, మహిమఁ జెన్నొందె నవ్వేళ మాధవుండు.

11


క.

వనరమకు న్మాధవునకుఁ, దనరఁగఁ బరిణయ మొనర్పఁ దఱి యనుజవరా
లునిచినముత్తెపుఁబ్రా లన, మొనసి వనిం గ్రొత్తమల్లెమొగ్గలు దనరెన్.

12


క.

రాగము చిగురాకున కను, రాగము బొజుఁగులకు ఘనపరాగము వనికిన్
రాగము మధుకరములకు స, రాగము గృహులకును గల్గె రహి నవ్వేళన్.

13


సీ.

శుకనాదములు ద్విజశ్రుతిఘోషములు గాఁగఁ
దేఁటీపాటలు పురంధ్రీగీతములు గాఁగఁ, గిసలముల్ తోరణవిసరములు గాఁగఁ
బలుకప్పురంపుఁదిప్పలు వితర్దులు గాఁగఁ, బుప్పొడు ల్వలిగందపొడులు గాఁగఁ
దెలిమొల్లమొగ్గచాల్పులు తలఁబ్రా ల్గాఁగ, విరిదీఁగెపొదలు పందిరులు గాఁగఁ


తే.

బుష్పితపలాశనికురుంబములు నివాళి, పళ్ళెములు గాఁగ నిర్భరపవనచలిత
తరువంబులు భద్రవాద్యములు గాఁగ, వనవధూమణిఁ జైత్రుఁ డుద్వాహమయ్యె.

14


సీ.

వ్యాకీర్ణమదచంచరీకశిరోజయుఁ, బ్రచలితమంజరీకుచభరయును
గళదనూనమరందఘర్మాంబులేశయు, లతికాభుజాశ్లేషలాలసయును
బ్రకటితసంరక్తపల్లవాధరయు వి, స్రస్తప్రసవపరిష్కారమణియుఁ