పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

ఓం నమః కామేశ్వర్యై

రసికజనమనోభిరామము

ద్వితీయాశ్వాసము



మద్ధరణీధరక
న్యామానసపద్మభృంగ నయగుణసంగా
సామజదనుజవిభంగా
కోమలభసితావృతాంగ కుక్కుటలింగా.

1


తే.

అవధరింపుము కమలజుఁ డమరమౌని, శేఖరున కిట్టు లని వేడ్కఁ జెప్పఁదొడఁగె
నవ్విధమన ఋతుధ్వజక్ష్మాధినాథుఁ, డురుబలోపేతుఁ డై వని నుండుటయును.

2


లయగ్రాహి.

అంతట వసంత మసురాంతకతనూభవదురంతనిశితప్రసవకుంతహృతపాంథ
స్వాంతము శుకీపికశకుంతకలనిస్వననిరంతరసమాకులదిగంత మసకృన్ని
ష్క్రాంతమధుపానమదదంతురితషట్చరణసంతతి విసృత్వరలతాంతము వనాంతా
శ్రాంతరతికాంతరణతాంతలలనాజననితాంతసుఖదానిలనిశాంతము దనర్చెన్.

3


క.

శుకపికశారీమధులి, ట్ప్రకరమహానినదనిబిడబధరీకృతస
ర్వకకుప్పతికర్ణం బై, యకలంకగతిన్ ధరిత్రి నామని యొప్పెన్.

4


తే.

జీర్ణపర్ణంబు లూడ్చి కెంజిగురుటాకు, జొంపములతోడఁ దరువులు సొం పెసఁగె వ
సంతురాక దలఁచి వనికాంతమెఱుఁగుఁ, దొడవు లెడలించి మణిభూష లిడె ననంగ.

5


క.

కుసుమితశాల్మలు లపు డిం, పెసఁగె న్విరహిణుల గెలువ నేగుచు నెలమిన్
బిసరుహశరుఁ డంపించిన, పసఁ బొసఁగెడుతమ్మికెంపుపనితేరు లనన్.

6


సీ.

శుకరాజమాగధప్రకరముల్ గీర్తింపఁ, గలకంఠకంఠకాహళులు మొరయఁ
బరిఫుల్లకింశుకకరదీపికలు గ్రాల, సాంద్రపరాగరజమ్ము గ్రమ్మ
సహకారపల్లవాంచత్కేతువులు మీఱ, సమదరోలంబసైన్యములు గొలువఁ
గేతకీగర్భదళాతతాస్త్రము లొప్పఁ, బృథుమరున్నినదభేరికలు చెలఁగఁ