| గనుఁగొనుచునుండ నిపుడె నిక్కముగఁ దనువు, విడుచుదాన నటన్న లో నడలి యతఁడు. | 146 |
క. | నాసాహీనుఁడ విద్యా, భ్యాసం బెన్నడు నెఱుంగ నంభోజముఖీ | 147 |
తే. | మును సురూపంబు సద్విద్యయును దొరకినఁ, బిదప నీవచనంబు చేసెద నటన్న | 148 |
క. | తపమున నాచే వాక్సతి, యపరిమితామోద యయ్యె ననలుఁడు నటులే | 149 |
క. | అని పలికి యవ్వధూటీ, జనరత్నం బపుడు భక్తి చాతురి మెఱయన్ | 150 |
సీ. | జయ చతుర్ముఖవక్త్రసౌధవిహారిణి, జయ సితాంభోరుహాసననిషణ్ణ | |
తే. | జయ పురందరముఖసుధాశనవితాన, భర్మకోటీరవిలసితపద్మరాగ | 151 |
సీ. | శుకదండవల్లకీముకురపుస్తకపాణి, లాలితనీలరోలంబవేణి | |
తే. | పరమకల్యాణి కమలసంభవునిరాణి, పరమపదసౌధనిశ్రేణి పరిచితేంది | 152 |
క. | తల్లీ యమరీలోకమ, తల్లీ మల్లీందుకుందదరసురభూరు | 153 |
మ. | చిరకారుణ్యమతీ మహాగుణవతీ శృంగారలీలారతీ | 154 |
మ. | తనరార న్భవదీయుసత్కృపకుఁ బాత్రం బైనపాజ్ఞుం డిలన్ | |