పుట:Rangun Rowdy Drama.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

రంగూన్‌రౌడీ.

జయ - మహారాజ్ !

గంగా - నాకు పెద్ద -- నాకు పెద్ద—-పెద్ద - పెద్ద--(వణఁకును.)

జయ - ఏమిటి ! నీకు పెద్ద?

గంగా - ఉండవోయ్- ఉండు. కొంచెము తమాయించుకోనీ! కొంచెము శాంతపడనీ! తొందరపెట్టకూ అబ్బా! చూడు గుండెలు కొట్టు కొంటున్నాయి !

జయ - ఏమిటి ! సైతాన్ కాదు గదా ?

గంగా - (అదిరిపడి) బాబోయ్! దర్వాన్? (వెఱ్ఱికేక పెట్టును.)

జయ - అరే భగవాన్ !

గంగా - ఉండు. నాకు - పెద్ద --- నాకు - పెద్ద--

జయ - ఆఁ! ఆఁ! పెద్ద – పెద్ద - ఏమిటో తమాయించుకొని చెప్పండి. గాభరా పడకండి.

గంగా -- నాకు పెద్దజ్వరం వచ్చిందోయ్ దర్వాన్ !

జయ - ఎందుకనీ ! మీ కిప్పుడు జ్వరం ?

గంగా - ఎందుకా ! ఎందుకా నువ్వెఱగవూ! నాకొంపలో సైతాన్ చేరింది; నాలో సైతాన్ చేరింది; నాకూతురులో సైతాన్ చేరింది ఇంతకు నువ్వు దర్వాన్ వో సైతాన్ వో తెలియకుండా వుంది.

జయ - నేను సైతాన్ ఎందు కవుతానూ? నేను; దర్వాను నే !

గంగా - ఏమో! ఓసైతాన్!-

జయ - సైతాన్ కాను; దర్వాన్ .

గంగా - దర్వానూ సైతానూ ఒక్కటేరా బాబు. ఒక్కటే నువు ప్రవేశించాకే నాకొంపలో సైతాను ప్రవేశించింది.

జయ -- సరే కాని, మీజ్వరానికి కారణ మేమిటి ?

గంగా -- సైతాన్ భయముచేత విజయనగరం వెళ్లి సానికొంపలో సరసా లేడ్చాను. బాబో! అక్కడే! అక్కడే! అక్కడే జరిగింది. —-