పుట:Rangun Rowdy Drama.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము.

89

జయ - ఏమిటీ! ఏమి జరిగిందీ !

గంగా - జరిగింది. ఏం జరిగితే యేమి - నావల్లనే జరిగింది. అయితే శంకరరావుమీద తోసేశాను. పోలీసుకు రిపోర్టిచ్చాను కూడా

జయ - ఏం జరిగిం దయ్యా?

గంగా - అబ్బా! పోనిస్తూ! ఏదో ఒకటి జరిగింది. తలచుకుంటే మళ్లి తల తిరుగుతూంది.

జయ - ఖూనీగాని జరుగలేదు గదా !

గంగా - అరే సైతాన్ ! అదేనోయి జరిగింది - అదే.

జయ - సైతాన్ అనకండి. దర్వాన్ అనండి.

గంగా - దర్వానే హర్వాన్, హర్వానే సైతాన్ .

(పోలీసువేషముతో కృష్ణమూర్తి ప్రవేశము.)

కృష్ణ - ఈ యింటియజమాని గంగారాంసేట్ యెక్కడ !

జయ - సేట్ మహరాజ్ ! పోలీసుభీ ఆగయా ! అబ్ క్యాకర్ సక్తే !

గంగా - పోలీస్ క్యా వాస్తే ఆయా? మేరా ఘర్కూ !

జయ — ఖూనీ మొఖద్దమామే, ఆప్కూ పకడ్ లేజానేకా వాస్తే, మహరాజ్!

గంగా - అరే - ఛూఫ్‌రే ఛూప్! కూనీ కౌన్ కియా హై ?

కృష్ణ - నీవేనా! గంగారాంసేట్ అనేవాఁడవు !

గంగా - ఔను బాబూ! ఔను నేనే.

కృష్ణ — నీపేర వారం టుంది. నిన్ను ఎర్రెస్టు చేయడానికి వచ్చాను.

గంగా - బాబో! నాకు వారం టెందుకు! నన్నెందు కెర్రెస్టు చేస్తారూ?

కృష్ణ - విజయనగరంలో, గిరికుమారి అనే వేశ్యయింట్లో - ఆడదాన్ని ఖూనీచేసి, ఆనేరం మఱొకరు చేసినట్టుగా తప్పుసాక్ష్య మిచ్చిన రెండునేరాలకున్నూ.

జయ -- సేట్ మహరాజ్ ! అంతా పబ్లిక్ అయిపోయింది. నిజమొప్పుకోండి.