పుట:Rangun Rowdy Drama.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము.

87

శంక - హా! దైవమా! ఎట్టిదుష్కరఘటనముల నెట్లు మార్చివేయుచున్నావు?

అన్న — తొందరపడకున్న ప్రమాదము రాఁగలదు. స్వామి స్వామీ! ఆతుపాకిని నా కిచ్చి పారిపొండు.

శంక - (నిస్పృహుఁడై తుపాకిని పారవైచి పరుగెత్తును.)

అన్న -- (తుపాకిని పట్టుకొని నిలువఁబడును.)

[పోలీసుఇన్‌స్పెక్టరు ఇద్దఱు పోలీసుభటులతో ప్రవేశించును.]

ఇన్ - ఎవ రీయింట హత్యచేయుచున్నది ?

అన్న — అయ్యా ! కనుపడుచుండుట లేదా ! నేనే హత్యచేసినాను. ఒకటి కాదు రెండుహత్యలను చేసినాను. నన్నే బంధింపుము.

ఇన్ — నీవెవ్వఁడవు? శంకరరావుహత్యచేసెనని వింటిమి. ఆతఁడెక్కడ ?

అన్న - నే నెవ్వఁడనో అది మీ కేల ? హత్యచేసినది నేను. నన్నే బంధింపుఁడు.

ఇన్ - శంకరరా వెక్కడ ?

అన్న -- శంకరరా వెవఁడో నే నెఱుఁగను.

ఇన్ -- అట్లయిన నీవేనా హంతకుఁడవు ?

అన్న - ఇదివఱకు రెండుసార్లు మనవిచేసితిని.

ఇన్ -- భటులారా ! వీనిని బంధింపుఁడు.

భటులు – (అన్నపూర్ణను బంధింతురు.)

(తెరవ్రాలును.)

రంగము - 2.

స్థలము-- గంగారాంసేట్ గృహము.

[గంగారాం, జయరాం ప్రవేశము.]

గంగా - దర్వాన్ !