పుట:Rangun Rowdy Drama.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

రంగూన్‌రౌడీ.

సన్నగిల్లుచున్నది. దైవికముగ నాయింటఁజేరిన: యీక్రొత్తబొమ్మను తెరపై కెక్కించి మరల కొన్ని నా ళ్లొక శృంగారనాటక మాడి రసికుల నాకర్షింపఁగలను. నాయండఁజేరినయీకాంత యెందుఁ బోగలదు?

ప్రభా -- (మూర్ఛలో) దాహము - దాహము.

గిరి - దాసీ ! దాసీ ! ఎంతసేపు జూగుచేసెదవే ! ప్రాణములు పోయిన పిదపఁ దెచ్చెదవా యేమి ?

[దాసి షరబతుగ్లాసుతో ప్రవేశము.]

దాసి - లేదమ్మా! బడలికనందియున్నయీమెకు వట్టిమంచినీరు తే నేలనని షరబతుకలిపి తెచ్చినందున జాగైనది.

గిరి — (షరబత్తును ప్రభావతిచే త్రాగించును.) అమ్మా ! కన్నులు తెరువుము. కొంచెము బడలిక తీరినదా?

ప్రభా - తల్లీ ! నీకు నమస్కారము ! వెడలిపోవనున్న ప్రాణములను నిలిపి పుణ్యముఁ గట్టుకొంటివి. ఇట్టి నీకొకనమస్కారమునకన్న నే నేమిచేయఁగలను?

గిరి - అమ్మా ! నీవు క్షేమముగ నుండుటయే పదివేలు. ఈ దాసితో లోనికరిగి, శుభ్రజలంబుల స్నానమొనరించి, చెమ్మటం దడిసిన యీవస్త్రములను విసర్జించి, నూతనవస్త్రములను ధరించి, హితవగునంత భుజించి రమ్ము. నాసంరక్షణమున నున్నంతవఱకు నీకేభయమును గలుగదు.

ప్రభా - అమ్మా !ఈయభాగినికొఱకై నీవేల శ్రమ నొందెదవు ? నాకీ ప్రాణములపై నభిలాష యెంతమాత్రమును లేదు. ఈస్థితియందు నాకు మరణమే శరణము!

గిరి - అమ్మా! నీపలుకులవలన నీవు మిక్కిలిదుఃఖజీవిని వని యర్థమగుచున్నది. ఐసను మరణము కోరుకొనినయప్పుడెల్ల వచ్చునా ? శరీర మున్నన్ని నాళ్లును దీనిని పోషించవలసినబాధ్యత తప్పదు గదా ? విచారమందక నామనవి విని యీ దాసితోలోని కరు