పుట:Rangun Rowdy Drama.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[6]

షష్ఠాంకము.

79

గుము దుఃఖశాంతి గావించుకొనుము. చూచెదవేమే ఈమెను మెల్లగా లోనికిఁ గొనిపొమ్ము.

దాసి - అమ్మా! లోనికి రమ్ము!

ప్రభా - ఆహా! దిక్కులేనివారికీశ్వరుఁ డెప్పటి కప్పు డేదోయొక యాశామృతముంబోయుచునే యుండునుగదా? (నిష్క్రమించును.)

గిరి - భళిభళీ! కాకినాడలో నాకు పూర్వపరిచితుఁడగు ధనశాలి గంగారాసేట్ నేఁ డిక్కడికి వచ్చెదనని లేఖవ్రాయుటకును, ఈక్రొత్తపిట్ట నాచేఁ జిక్కుటకును సరిపోయినది. అనుకూలసమయ మనిన నిట్లుగదా కలిసిరావలయు! రైలువచ్చి చాల తడవైనది. సేటుగారింకను రాకుండుట కేమికారణమోగదా ?

[దాసి ప్రవేశము.]

దాసి — అమ్మా! కాకినాడకాపురస్థులఁట. మారువాడీలట!

గిరి - ఆఁ! ఏమి? గంగారాసేట్‌గారు వచ్చినారా?

దాసి — ఔనమ్మా! వారే వచ్చియున్నారు.?

గిరి - సరి! నేనును వారికొఱకే వేచియున్నాను. నేను వారి కెదురేగి తీసికొనివచ్చెదను. ఈలోపల నీవు గదియంతయు నలంకరించి, పరిశుభ్రముగా నుంచుము.

(నిష్క్రమించును.)

దాసి - (గదిని అలంకరించుచుండును.)

[గిరికుమారి, గంగారాంసేట్ ప్రవేశము.]

గంగా -- (గదినంతయు కలయఁ జూచి) గిరికుమారీ! మీవృత్తి కెచ్చటనున్నను 'నిత్యకల్యాణము పచ్చతోరణమే' కదా?

గిరి - ఏమున్నది బాబూ! కాకినాడలో నున్నప్పటి ఖాతా బేరాలన్నీ చల్లబడ్డతరువాత, విజయనగరం చేరుకున్నందువల్లనే కాస్తవీలుగా బ్రదుకుచున్నాను. నాఁటికి నేఁడేగదా! తమరికి దాసురాలిమీఁద కరుణగలిగినది!