పుట:Rangun Rowdy Drama.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రంగూన్ రౌడీ.

అను

పతిభక్తి.

షష్ఠాంకము.

రంగము 1.

స్థలము:--గిరికుమారి మందిరము.

[గిరికుమారి సంగీతగోష్ఠియం దుండగా వికృతాకారముతో ప్రభావతి ప్రవేశించును]

ప్రభా - అమ్మా! దాహము ! దాహము !! (క్రింద పడిపోవును.)

గిరి - (దగ్గఱకు వచ్చి చూచి) అయ్యో ! యెవ్వతెయో మిగులు నలసి వచ్చినది - దాసీ ! దాసీ ! శుభ్రమైన శీతలోదకము కొనిరావే !

దాసీ -- (నిష్క్రమించును.)

గిరి - (ప్రభావతిశిరోజములు సరిజేయును) ఆహా ! విధాత యెంతనిర్దయుఁడు ? ఎట్టిసౌందర్యవతి కెట్టిదురవస్థ కలిగించెను ! ఆహారపానీయములు లేక, మొగము కళఁబాసియున్నను సహజమైన సౌందర్యవిలాస మెట్టివారినైన సమ్మోహింపఁజేయునదిగా నున్నదే! భళీ! ! గిరికుమారియదృష్టము ! నాయింటనున్న తొత్తులలో నొక్క తెయు నీమె కాలిగోటికైన సమానమగునది కానరాదు కదా ! ఈజగదేకసుందరిని భగవంతుడు నాపై ననుగ్రహముననే పంపియుండెఁ గాఁబోలును! “ప్రాఁతరోత, క్రొత్తవింత"యనునట్లు నావద్దనున్న ప్రాఁతతొత్తులవలన రాబడి క్రమముగా