పుట:Rangun Rowdy Drama.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాంకము.

71

శంక — (కపటముగా) ఆ ! ఆ ! నిజముగా తీసివేయుచుంటివాయేమి ? వలదుసుమా! వలదు సుమా! వలదు. ఊరకపరిహాసమున కంటిని గాని, నిజమని నమ్మితివా ! ఈదినమునఁ గలిగినవిరక్తి రేపు గలుగునా? వట్టిమాట. (ఆభరణములు తీసికొనును.)

ప్రభా - (స్వగ ఆహా! ఇప్పటికి ఐహికాశాబంధములతో సంబంధము పూర్తిగఁ దీరిపోయినది. ఆత్మసన్యాసినైతిని, ఓ జగదీశా ! నీపాలిటికి వచ్చుచున్నాను. పాపాత్మురాల నగు నన్ను క్షమింపుము; అనుగ్రహింపుము.

చ. అవనిని నన్నుఁ బోలిన మహాదురితాత్మలు వేనవేలు నీ
    ప్రవిమలసత్కృపానిరతి బుధములం బెడఁబాసి పాపసం
    భవమగు నీభవానల మపారముగాఁ దరియించినారు; మా
    ధవ! కరణింపవే ! కలుషకర్మవిపాకము నాశమందఁగన్ .

శంక - (స్వగ) చేఁ జిక్కవలసిన దంతయుఁ జిక్కినది. ఇంక నీయలుకు పిడచతో నా కేమిపని ! క్లబ్బులకు వేళయైనది. నేఁ బోవలయు ఏడ్చియేడ్చి యిది యెందైన నరుగుగాక !

(అనుబంధము - 22.)

(నిష్క్రమించును.)

[ఒక బట్లరు ప్రవేశించును.]

బట్ల ఏమమ్మా ! శంకరరా వెక్కడ?

ప్రభా - అయ్యా ! ఇంతకుముం దిందే యుండెను. ఇప్పుడే యెచ్చటికో పోయెను. అతనితో నీ కేమైన పని యున్నదా ?

బట్ల - పనియా ! ఔను పనియే యున్నది.

ప్రభా - అతఁ డింట లేన ట్లున్నాడు.

బట్ల - అతఁడు లేకున్న నీవైన మాబాకి యీయక తప్పదు.

ప్రభా - అయ్యా ! ఎక్కడి దాబాకీ ? VY