పుట:Rangun Rowdy Drama.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

రంగూన్‌రౌడీ.

బట్ల - ఎక్కడిదా ! మాహోటల్లో నీమగఁడు మతిలేకుండ త్రాఁగిన బ్రాందితాలూకుబాకీ - తిన్న కోడిమాంసపుపులావుప్లేట్ల తాలూకుబాకీ అర్థ మైనదా ?

ప్రభా - కావచ్చును. అట్లయిన న న్నేమిచేయుమందువు ?

బట్ల - ఏమైనను చేయవలెను. మాబాకీధనమును నిలుచున్నపాటున క్రక్కి తీరపలెను. తెల్లవాఱినతోడనే పంపెద నని చెప్పి వెళ్లినాఁడే! జ్ఞానము లేదా వానికి? ఇప్పటి కాఱుదినములు దాటినను మేము పెద్దమనుష్యుఁ డనుకొని, నిర్బంధింపలేదు. ఇదియా నీమగనిమర్యాద !

ప్రభా - ఆడుదాననైన నాతో నీవు నిష్ఠురములాడిన లాభ మేమి నాయనా?

బట్ల - చాలు చాలు ! చిలుకపలుకు లావెనుక నెన్నైన నాడుదువుగాని ముందుగా నాబిల్లు ఫైసలు చేసి పంపుము.

ప్రభా - అయ్యా ! న న్నేల తర్జనభర్జనములు చేసెదవు ?

బట్ల - ఇదిగో ! నే నీమెత్తనిమాటలకు మోసపోయి వదలిపెట్టి వెళ్ళువాఁడను గాను. మంచిమాటలతో డబ్బిచ్చితివా సరే! లేదా - నిన్ను ఆడుదాన వని కనికరించువాఁడను గాను. నడువీధిలోని కీడ్చి అల్లరిపెట్టి నాడబ్బును వసూలుచేసుకోఁగలను. ఆడుదానవు కనుక నే యింతవఱకు కనికరించితి ననుకొనుము.

ప్రభా --అయ్యా! నావద్ద దమ్మిడియైనలేదు. నావద్ద నేమితీసికొనెదవు?

బట్ల - ఓహెూ ! చాల పెంకెతనముగ నున్నదే వ్యవహారము! నేను చెప్పుచున్నాను వినుము. వట్టిమాటలవాఁడను కాను. అన్నంత పనియుఁ జేసితీరుదును. తుదకు నాధన మెట్లును రాకపోదు. కాని యాఁడుదానవు, అల్లరిపా లగుదు వని విచారించుచున్నాను.

ప్రభా — నాయనా! నావద్ద ధన మేమియునులేదు. నే ననృతములాఁడు