పుట:Rangun Rowdy Drama.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

రంగూన్‌రౌడీ.


రమే - ఆఁ ! ఏమిరా ! తుచ్ఛుఁడా! నను బెదరింపఁ జూచుచున్నావా?

శంక -- బెదరించెదనా?

రమే - కాకున్న నీ వేమిచేయఁగలవు ?

శంక - ఖూనీ చేసెదను.

రమే - ఆఁ  ! ఎనరిని?

శంక - నిన్నే ఖూనీచేసెదను. నీ లెక్కమాత్రమేమి ? (తుపాకితోఁ గొట్టును.)

రమే -- (దెబ్బతగిలి పడిపోవును.)

(తులసీరావు పోలీసులతోఁ బ్రవేశించును. శంకరరావు ప్రభావతితో పారిపోవును. పోలీసులు వెంటాడుదురు.)

[సీను టాన్స్‌ఫర్ అయినది. నదిమీద వంతెన కనబడును. శంకరరావు, ప్రభావతి వంతెనమీద రెండవవైపున కేగుదురు. శంకరరావు వంతెనను విరుగఁగొట్టును. పోలీసులు రెండవవైపున నుందురు. శంకరరావు ఒక్కొక్కనినే తుపాకితోఁ గొట్టి పడవేయును. తుదకు తులసీరావు మిగులును. శంకరరావు తుపాకి వట్టిదగును.]

( తెర మెల్లగ వ్రాలును.)

చతుర్థాంకము.