పుట:Rangun Rowdy Drama.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రంగూన్ రౌడీ.

అను

పతిభక్తి.

పంచమాంకము.

రంగము-1.

స్థలము:- విజయనగరములో.

[సారాయిబుడ్డి చేతఁబట్టుకొని, శంకరరావు ప్రవేశించును.]

(అనుబంధము - 21.)

శంక -

తెలివిలేని ముసలిబ్రహ్మ ఒకసారి మానవునినుదట లిఖింపక నే యుండవలయును. లిఖించిన యదృష్టరేఖను తుడిచివేయ వానికిమాత్రము సాధ్యమగునా ! (మీసము దువ్వుచు) భలీ ! శంకరరావ్ ! నీయదృష్ట మసామాన్యమైనది. దానికి చలనములేదు. ఈ ప్రపంచమునందలి మానవమాత్రుఁ డెవ్వఁడును నీయదృష్టజ్యోతిని తేరిచూడఁజాలఁడు.

సీ. జనకునిస్వార్జితం బనుభవింపగనీని
                 పవరుదారును నేలపాలుచేసి
    బంధింపవచ్చిన శ్వశురు మోసముఁజేసి
                సాగరంబునఁ బడి చావకుండ
    తనయిల్లుజేర్చిన ఘనునికన్నులలోన
                కారముఁజల్లి తత్కాంతవలచి
    వెదకుచు నా వెనువెంటనే వచ్చిన
                యాత్మదారనుసైత మవల ద్రోసి