పుట:Rangun Rowdy Drama.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధమాంకము.

11

జూతునా! ప్రాఁత \చెప్పుతో సమానముగ వదలియే వేసతినిగదా! ఇంక దాని ప్రసక్తి యేమున్నది? కూడులేకున్నగుమ్మమున కింత కబళముగా భిక్ష మెత్తుకొని తిరిగిననైన సమ్మతింతునుగాని, కూటికై దాని కొక్క గ్రుడ్డిగవ్వయైనబంపుదునా ?

గిరి - వట్టిమాటలు చెప్పినంతనే అవి వాస్తవమునకు రావలయునుగదా! కాళ్ళపైఁ బడి వేడుకున్నంతనే మీమనస్సు కరుగకుండునా?

శంక - ఆ ! ఏమంటివి ! నే నంత దుర్బలహృదయుఁడననియేనా నీ యభిప్రాయము ? నాముదుసలితల్లి తనకు భరణమైన నీయవలసిన దని నాల్గుకబురు లంపినను నామనస్సు కఱగిన దనుకొంటివా? చీటిఁ దెచ్చినవానిని, చీటికిమాటికి కబురులు మోయ వద్దని చెంపదెబ్బలతోఁ గూడ సాగనంపితిని. ఏమనుకొంటివో ?

గిరి -- సేబాస్ ! ఇప్పుడు నామనస్సునకు నచ్చినది ! కాని పడుచుభార్యను నిరాకరించుట, ముసలితల్లిని నిరాకరించుటవంటిదికాదేమో యని కొంచె మనుమానము పీడించుచున్న ది.

శంక - హహ్హహ్హహ్హహ్హ! ఈదినమున నీకనుమానములు పెనుభూతములగుచున్నవి. లోపలికి బ్రాందిచుక్క అథికముగా పడనిలోపమే మో యిది యని, నాకుఁ దోఁచు చున్నది. కొంచెము గొంతు తడిచేసికో ! (సారాయి గ్లాసులోపోసి)

(అనుబంధము. 6.)

(ఇచ్చును.)

గిరి - (త్రాగి) మీరన్నట్లు ధైర్యము గల్గించుటలో - దారూకన్న నెక్కువశక్తిగలవస్తువు కనఁబడదు.

శంక - (వీపుపైఁ దట్టి) సెబాస్ ! ఇప్పుడు నీకు సారాయిసామర్థ్యము చక్కఁగా దెలియుచున్నది.