పుట:Rangun Rowdy Drama.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

రంగూన్‌రౌడీ.

రంగము. 3.

(శంకరరావు గిరికుమారి త్రాగుచుందురు.)

శంక - చూచితివా ! నా దెబ్బ !

సీ. తండ్రి చచ్చినతోనే తఱగని యైశ్వర్య
               ముల కధికారినై నిలిచినాను
    శ్రీరంగనీతులు చెప్పవచ్చిన కుల
               దార నీడిచి కాలఁ దన్నినాను
    భరణంబు నిమ్మని పలుమారు కబురంపి
               నట్టి తల్లికి సున్న చుట్టినాను
    బ్యాంకి రోడ్డున నున్న భవనంబు నెనిమిది
               వేలకు తాకట్టు పెట్టినాను

    మితి నెఱుంగని విందులు మిత్రతతికిఁ
    జేసితిని మఱి యెన్నేని చేయఁగలను;
    వసుధలోపల నావంటిభాగ్యశాలి
    యరసి చూచిన దొరుకునే గిరికుమారి!

నాప్రేమను బడయంజాలిన నీ భాగ్యమే భాగ్యముసుమా ! నా సర్వసంపదలకు నీవే సర్వాధికారిణివి. కావున నేనేకాక - నామిత్రు లందఱును నీ మృదుపాదములచెంతదాసానుదాసులై నిలువవలసినవారే !

గిరి - ప్రియా ! ఇది యంతయు మీకటాక్షము ! కాని భార్యను నిరాకరించి వచ్చితి ననుచున్నారు. నాయైశ్వర్యమును జూచి యోర్వలేక, మాయలమారియైన మీభార్య న న్నేమిచేయునో యని భయపడుచున్నాను.

శంక - ఛీ ! ఛీ! ఎంత వెఱ్ఱియాలోచన చేసితివి ? నా వంటివాఁడు. నీకుఁ బ్రియుఁడై యుండఁగా అన్నపూర్ణ నిన్నేమో చేయఁగల దని హడలిపోవుచుంటివా? అన్నపూర్ణ మొగమైన నింకఁ