పుట:Rangun Rowdy Drama.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

రంగూన్‌రౌడీ.

[శంకరరావుతల్లియు, జానకియు ప్రవేశము.]

జాన - అన్నా ! అమ్మకు భరణమీయ నని పలికి చీటీతెచ్చినవానిని చెంపదెబ్బలు కొట్టితివఁట ! ఇదియేమియన్యాయము ? కన్నతల్లికి కన్నీరుగార్పించుట ఘనమని తోఁచినదా నీకు ? ఎవరైన విన్న నే మందురు ? మనవంశపుకీర్తి యంతయు నేఁటితో మంటఁగలపఁదలంచితివా? అన్నా ! ఇదివర కేమిచేసినఁ జేసితివిగాక ! ఇకనైన, మన తల్లి నాదరింపుము. కుమారుఁడవైననీవు నిరాకరించిన యెడల నామెకు దిక్కెవరు ?

శం - ఓహో! ఇట్టినీతుల నుపదేశింపుమని నీవదినె యేమైన బోధించి పంపించినదా నీకు? ఓసీ తెలివిమాలినదానా? ముసలిదాని మాట యట్లుంచుము. నీకును నీవదినెకును మాత్రము దిక్కెవ్వ రనుకొంటివి. మి మ్మందఱనుమాత్రము నేను పోషింతు ననుకొంటివా?

తల్లి -- (కోపముతో) ఓరీ ! యౌవనమదాంధుఁడా ! జ్ఞానహీనుఁడా ! నీవు మ మ్మందఱ నేల పోషింతువురా ? ఈసంపద యంతయు నెవ్వరి దనుకొంటివిరా ? భ్రష్టుఁడా ! పాపాత్ముఁడా ! కన్నతల్లి కడుపుకాల్చిన నీవు గతిలేక పురుగులుపడి చావ వఁటరా ! తుదకు ని న్నీమిత్రులును, వేశ్యలును, త్రాగుడును, రక్షించు నఁటరా ! ఎంతగా కన్నులు మూసికొని సంచరించుచుంటివిరా? కులనాపకా ! మాతృద్రోహీ ! చండాలుఁడా !

శంక - (పండ్లుకొఱుకుచు) ఓసీ ! ముసలిబానిసతొత్తా ! ఏమని ప్రేలు చుంటివే ! చావసిద్ధమైనదానవని. తల్లిముండవని- నిన్ను దయ దలఁచితిని గాని, లేనిచో - (పిడికిలి చూపును.)

జాన - అమ్మా! ఎందుల కీకోపము ? ఊరకుండుము - అన్నా! అమ్మకు పెద్దతనము వచ్చినది. మతి మొదలే లేదు. అట్టిదానిమీఁద