పుట:Rangun Rowdy Drama.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధము

105

(6) శంకరరావు.

భూప్--- అదితాళము.

బ్రాందీ సమానమైన | పానీయ మీయిల గలదే! బ్రాం!

పానీయ మీయిలగలదే ! పానీయ మీయిలగలదే | ఫోర్సు (Force) చేరఁగ | ఫ్యాషను (Fashion) మీరగ త్రాగీ! ముదమేపారఁగ! షైరు(Shire) గావింతున్ ! నీతో ! షైరు గావింతున్ వహ్వారే ! యపు డొదవెడు నాయానందం బెన్నగ నగునా!

(మాటలు)

పోరింగ్ సం సోడా యిం దీ గ్లాస్ (Pouring some soda in the glass)

హ్యావింగ్ సం బరఫ్‌థ్రూదీడోస్ (Having some harafk through the dose)

అండ్ దెన్ డ్రింక్ పెగ్ బై పెగ్ (And then drink peg by peg)

హా హా హా హా హాహా బ్రాంది! (Ha Ha Ha Ha Ha Ha)

(7) జానకి.

బ్యాగ్ - ఆదితాళం.

వదరకుము పాపాత్ముడా | మాతోడా
వెలసతి జూడా | మధువశమున|| వద||

మాతను సోదరి నవమానించుచు! నే తనయులు నీకీతిఁజరించిరి || పాతకుఁడవు కుల నాపకుండ వే | ప్రాప్తము గల్గునో పరికింపుము: వద॥

(8) నాందీ బాయి.

బ్యాగ్ - ఏకతాళం.

మొగుడుముండాకొడుకు | మొదలారి చస్తే |
పొగవేసి కాళికకు | పోతు బలియిస్తా! మొ'!
మొగము కొండాముచ్చు | ముక్కు పొడుమూ గచ్చు !
కనబడ్డనావొళ్ళు | భగభగని రెచ్చూ !
విరగడైపోతేను | కోరికలు హెచ్చు! మొ!!