పుట:Rangun Rowdy Drama.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

రంగూన్‌రౌడీ.

(9) డైలాగు.

బ్యాగ్ - రూపకం.

నాందీ - ఓసీ చటకారీ నీ మదమణిగింతునే | నాభర్త | మహామూఢాత్ముం డౌగదా! ఓ!

దాసీ - ఓసీ పిసినారీ నాపైనధికారములా | నాపసన్ జూపింతూ! రోషం బడగింతున్ |

ఇద్దఱు - ఇకతాళనూ ! కనజాలనూ | కుక్క కాటుకూ | చెప్పుదెబ్బ లే! కా! మందూ!

గంగ - వెరి వెల్ | వెరి వెల్ ! వెరి వేల్ || (very well)

నాందీ - ... || ఓసీ||

(10) రాధాబాయి.

బీన్ ఫలాస్ -- ఆది.

ప్రేమసఖా | మోహనాకారా|| ప్రే!!
మానినీ మానసానందచోరా॥ ప్రే!!
తావకీనమహిమా | దరణచే ప్రేమా |
లీననైతి విమలా | కారుణ్యసుధామా !
సంప్రీతిన్ | ప్రేమింతు నిన్నున్ | వినోదా |
ప్రమోదా | కామాబ్ధిదేల్ప రమ్మా! ప్రే!!

(11) అన్న పూర్ణ.

హిందూస్థానీముఖారి - ఆదితాళం.

హతవిధీ మాయాయేమో | పతికి నాపై బ్రేమా | తీరెనా
సుఖసంప్రాప్తి చనెనా!! హ!!
మధుపానమేనాడూ | మదిన్ విడడేసతమూ | అధమవేశ్యాలోలు
డయ్యెనా ! అయ్యయ్యో 1 సుఖసంప్రాప్తి చనెనా!! హ!!