పుట:Rangun Rowdy Drama.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

రంగూన్‌రౌడీ.

జాస్‌మైన్ | వైటు (Jasmine white) నాదు సదనమూ ! ననుగని భ్రమ మునుగరే | ఘనులగు సురలైననూ || నేనుగదా!

(4) డైలాగు.

బ్యాగ్‌రాగం - రూపకం.

జయ — ఆహా రాధా సంపూర్ణసుధామోహిని | నిను వినా ! సుదతి గనా | లోకమునా|| అ!

రాధా - నీకవిత్వమే ! సుధాకరము ప్రణయభరముగా | మదికి మోదంబౌ నామనోనాధా||

జయ - నాదుజీవనంబు నీదు | చరణముల కొసంగెదన్ | కమలవిమల నయనయుగము గనగ గనగ మోద మొదవుగా|| అ!

(5) డైలాగు.

సురట- త్రిశ్రగతి.

రాధా - నాదుప్రియునినోనాడకు | నాయనా | నటకుఁడగుట నటుల సలిపె ! ప్రియమునా!! నా||

జయ - నిజమిదియే | నామదిగల దదియే | ఘటికుడ | సటకుఁడ | నగుకవి | నిది వినుమా |

రాధా - లీలానటనంబున కీ ! వేలా తామసమూనఁగ | ఖేలనమే యిది నిజమని | బేలవై తలంతువా! |

గంగా - ఇదియే బహుమానము తులువా |

జయ - కదలిచనెద వదలుము నన్ ! క్రూరత నీరీతిబాధింపగ న్యాయమా|

గంగా - వెకలీ | యిఁకరాకుము నా సుతతో సరసంబులనాడన్ |

రాధ -... ... ||నాదు||