పుట:RangastalaSastramu.djvu/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తక్కిన నాటకాలలో ఈ రెండో సూత్రధారుడు నటితోకూడి పారిపార్శ్వకుడు, మారిషుడు అనే పేర్లుగల ఇంకో నటునితోనో, విదూషకునితోనో చమత్కార సంభాషణ నరపుతూ-ప్రయోగించబోయే నాటకంపేరు, కవి పేరు, అతని సామర్ధ్యము, నటీనటుల నిపుణత ప్రేక్షకులకు తెలియజేస్తాడు. తరవాత నట నాటక కధావస్తువును అనుగుణమైన ఋతుగానము చెస్తుంది. ఆ తరవాత నాటక కధాప్రస్తావన మూడు విధాలు: 1.కధోద్ఘాతము, 2.ప్రవృత్తకము, 3.ప్రయోగాతిశయము.

1. కదోద్ఘాతము: సూత్రధారుని మాటలను గాని, వాటి అర్ధమును గాని గ్రహించి, పాత్ర ప్రవేశీంచడం. రత్నావళిలో సూత్రధారుడు-

కడలి నదుమనుండి, కడలి కావలినుండి,
యెందు దీవిగద్దనుండి తెచ్చి,
నిమిషమాత్రలోన సమకూర్పులో విధి
యభిముఖుంద యేని యభిమతమును!

అని చదివిన పద్యాన్ని గ్రహించి, దానినే అర్ధంలో చదువుతూ పాత్ర (యౌగంధరాయణుడు) ప్రవేశించడం ఇందుకు ఒక ఉదాహరణ. వేణీసంహారంలో సూత్రధారుదు "కురురాజ సుతులు స్వస్థులగుదురుగాక!" అని అన్న వాక్యాన్ని గ్రహించి, పాత్ర (భీముడు ప్రవేశించడం ఇంకో ఉదాహరణ.

2.ప్రవృత్తకము: ప్రస్తావనలో కాలసూచకంగా చేసిన గానంలోని ఋతువులో సమాన గుణధర్మాలుగల పాత్ర ప్రవేశించడం, ఋతువర్ణనలో "దశాన్యుని రాముడు నశింపజేసినట్లు... ... ... శరత్ సమయము వచ్చినది." అనగానే శరకక్కాల సామ్యాన సూచితుడైన రాముడు ప్రవేశిస్తాడు.

3.ప్రయోగాతిశయము: సూత్రధారుడు నిర్ధేశించిన పాత్ర ప్రవేశించడం, శాకుంతలంలో సూత్రధారుడు-

"... ... ... లీల నతివేగవంతమౌ లేడిచేత
వడిగ దుష్యంతనృపు డీద్వండిన యట్లు"1

అంటూ నిర్ధేశించగానే దుష్యంతుని పాత్ర ప్రవేసిస్తుంది

1.---వేదం వేంకటరాయశాస్త్రి, రత్నావళి నాటిక పుట.3

1.--- కందుకూరి "అభిజ్ఞాన శాకుంతలము"(అను) ప్రధమాంకము, నాంది, పుట.1