సాదృశ్యము
ఇట్లాంటి ప్రస్తావనను "ప్రోరోగ్" అనే పేరుతో పాశ్చాత్య నాటక కర్తలు తమ నాటకాలలో ప్రయోగించినారు. ముందుగావచ్చిన ప్రేక్షకులను రంజింపజేయడానికి 'కర్టెన్ రైజర్" అనే పేరుతో చిన్న ప్ర్రహసన ప్రదర్శనము పాశ్చాత్యదేశాలలో పూర్వము ఆచారంగా ఉండేది. ఈ నాందీ ప్రస్తావనల సందర్భంలో ఈ విషయము గమనార్హము.
సాదృశ్యము (Parallelism)
ఒకే రూపకంలో ఒక దానితో ఓకటి పోలిన రెందు కధలను గాని, రెండుసంఘటనలను గాని, రెండు పాత్రలను గాని ప్రవేశపెట్టితే అని ఒకదానికొకటి పుష్టి చేకూర్చుకొంటవి: ఒక్కొక్కప్పుడు క్లిష్టతకు దారితీస్తవి, ఏదైనా మొత్తం రూపకానికి రమణీయతను చేకూరుస్తాయి. ఈ విధానాన్నే సాదృశ్యమనీ, భావపునరావృత్తి అని అంటారు. దీనిని కధాసాదృశ్యము లేదా కధాపునరావృత్తి: సంఘటనా సాదృశ్యము లేదా సంఘటనా పునరావృత్తి; పాత్ర సాదృశ్యము లేదా పాత్ర పునరావృత్తిఅని మూడు రకాలుగా విభజించుకోవచ్చు.
రూపకప్రధానకతను, చినకధకు కధావస్తువు ఒకటేఅయి, కధావిన్యాసంకూడ ఒకేమాదిరిగా నడిస్తే దానినికధాసాదృశ్యమంటారు. ప్రధానకధ పునరావృత్తమైనట్లు గోచరిస్దుంది. ఇందుకు చక్కటి ఉదాహరణ షేక్స్ పియర్ రచించిన లీర్ రాజి రూపకము. ఇందులో ప్రధానమైన లీర్ రాజు కధకు, ఉపకధ అయిన గ్లాస్టర్ కధకూ కధావస్తువు ఒకటే - పితృద్రోహము! ఈ రెండు కధలలో తండ్రులు ప్రేమించిన సంతానము వారిని బాధించడం, ద్వేషించిన సంతానము వారిని రక్షింఛడం జరుగుతాయి. ఇట్లాగే యాజ్ యు లైక్ ఇట్ (As You Like it) రూపకంలో భాతృద్రోహకధ పునరావృత్తమవుతుంది. సాదృశ్య ప్రేమగాధలు, వియోగగాధలు షేక్సి పియర్ రూపకంలో ఎక్కువగా గోచరిస్తవి.
మృచ్చకటికలో వసంతసేనా చారుదత్తుల, మదనికా శర్విలకుల ప్రేమగాధలు; మాలతీ మాధవంలో మాలతీమాధవుల, మదయంతికా మకరందుల ప్రేమగాధలు; ప్రమీలార్జునీయూంలోని ఎనిమిది ప్రేమగాధలు; రామాయణ నాటకాలలో రామ సుగ్రీవుల ప్రేమగాధలు సాదృశ్యకతల కుదాహరణలు.
కధాసాదృశ్ల్యము అవహేళనకు కూడా ఉపయోగపడుతుంది. స్పెయిన్ నాటకాలలో ఇది ఎక్కువగా గోచరిస్తుంది. 'ఇంద్రజాలికుడు ' అనే రూపకంలో