Jump to content

పుట:RangastalaSastramu.djvu/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెయ్యంతలు కుయి కుయి కుయి అనేది. దానికంటా దీని యిసేనం యేంటీ అంటా".

మృచ్చకటికలో శకారుడు--

"ఏను దుశ్శసనునివలె నిపుడు నీదు
కొప్పు దొరకొందు, జమదగ్ని కొదుకు భీమ
సేను డేతెంచి యాపునో చానకుంతి
కాత్మజుండను దశకంఠు డాపగలడొ: 1

ఈ ఆసందర్భ ప్రలాపాలతో పై ఇద్దరిశీలము వ్యకతమవుతున్నది.

చేతలు: హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు విశ్వామిత్రునకు రాజ్యము ధారపోసి సత్యవ్రతము కాపాడుకోవడంవల్ల అతని సత్యవ్రత దీక్ష తెలుస్తుంచి. కన్యాశుల్కంలో గిరీశం మధురవాణి మంచంకిందదూరి రామప్ప పంతులును తప్పించుకొని గోడవైపు చేరడంవల్ల అతని సమయస్పూర్తితెలుస్తుంది. ప్రతాపరుద్రీయంలో యుగంధరుడు "మృచ్చమటిక"లో చారుదత్తుడు తనకు మృత్యుదండన విధింపజేసిన శకారుని క్షమించడం అతని హృదయ వైశాల్యాన్ని నిరూపిస్తుంది.

దివ్య ప్రకాశము

ఒక పాత్రను వక్కపాత్రలకంటె ఎక్కువ వెలుగులోకి తెచ్చి మకాకమానము చేసి, ఉన్నతస్థాయికి చేర్చదలచినప్పుడు ఆ పాత్ర శీలాన్ని, రూపాన్ని గురించి పలుపాత్రలచేత పదేపదే చెప్పించే విధానాన్ని దివ్య ప్రకాశనమంటారు.

షేక్సిపియర్ మర్చెంట్ ఆఫ్ వెనిస్ లో ఆంటోనిపాత్రను ఆ నాటకంలో ప్రుతిపాత్ర మెచ్చుకొన్నట్లు చిత్రించి, తక్కిన పాత్రలకన్న ఎక్కువ ప్రకాశమానము చేసి, ఉన్నతస్థాయికి తీసుకొని వెళ్ళీనాడు! ఇక ప్రతాపరుద్రీయంలో ప్రతిపాత్రచేత యుగంధరమంత్రిని రచయిత స్తుతింపజేసినాడు.


1.--తిరుపతి వేంకటకవుల "మచ్చకటిక" (అను), ప్రధమాంకము--పుట 15.