పుట:RangastalaSastramu.djvu/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాత్రచిత్రణ

"వీరయుగంధర్ పేరు చెప్పితే నీరువిడచు ఘోడా
రుద్రయుగంధర్ ముద్రపెట్టితే నిద్రపోరు హధీ".1

అనిచెప్పడంలో పై శీలచిత్రణకు బలము చేకూరుతున్నది. ఇట్లాగే బలిజేపల్లి వారి హరిశ్చంద్ర రూపక ప్రారంభంలోనే వశిష్ఠుడు--

"చాతుర్వర్ణ్వ విధానముల్ నదుపుచున్ సత్యంబు, ధర్మంబహిం
సాతత్వాది గుణంబులన్ బ్రజల యాచారంబు శాసించి వి
ఖ్యాత శ్రీధరనేలువా డఖిల దీనానాధ రక్షాదిదృక్షా
తాత్పర్య దయాతిసాంద్రుడు హరిశ్చంద్రుండు నిస్తంద్రుడై" 2

అనిచెప్పడంతో హరిశ్చందుని శీలము, కన్యాశుల్కంలొ అగ్నిహోత్రావధాన్లను గురించి కరటకశాస్త్రి "వట్టి అవకతవక మనిషి" అని చెప్పడంతో అగ్నిహోతావధాన్లు శీలము విస్పష్టమవుతున్నది.

పాత్ర తనను గురించి తానె చెప్పుకోవడం: హరిశ్చంద్రలో విశ్వామిత్రుడు తననుగురించితాను

ఎఱుగవా త్వత్పురోహిత వశిష్ట తనూజ శతక నాళీక కుంజరుని నన్ను


ఏల యుఎఱుగవు చెప్పుమోరీ దురీశ! 3

అనిచెప్పుకోవడంతో అతని శీలము తేటతెల్ల మవుతొంది. అట్లాగే కన్యాశుల్కంలో గిరీశం "నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్" అనటంతో అతడు వట్టి డాబులరాల్యుడని తెలిసిపొతున్నది.

పాత్రక్రియలు

ఇగి మాటలు, చేతలు అని రెండు విధాలు.

మాటలు; ప్రతాపరుద్రీయంలొ పేరిగాని చాకలి భాష- "ఒకపాలి నేనొక బేసినా పెంచినా, అది కార్తిలో ఆడబేపిని సూస్తే ఇంతకంటా


1--వేదంవారి ప్రతాపరుద్రీయము-ప్రధమాంకము. పుట 10.

2.--బలిజేపల్లి లక్ష్మీకాంతం గాని, "సత్య హరిశ్చంద్రీయము" ప్రధమాంకము., పుట 8

3.--అదే నాటకంలో తృతీయాంకము, పుట 31.