పుట:RangastalaSastramu.djvu/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ రచనా ప్రణాళికలోని బీజము, బిందువు, పతాక, ప్రకరి, కార్యములను అర్ధప్రకృతులంటాతు. అర్ధప్రకృలంటే ఫలహేతువులు. ప్రారంభము, ప్రయత్నము, ప్రాప్త్యాక, నియతాప్తి, ఫలాగమాలను అవస్థలంటారు. ఒక అర్ధప్రకృతితో ఒక అవస్ధ కలసిఉన్న కధాభాగాన్ని సంధి అంటారు.

పాత్రచిత్రణ

పాత్రచిత్రణ ప్రాముఖ్యాన్ని ఇదివరలొ తెలుసుకొన్నాము. పాత్రచిత్రణకు సామాన్యంగా రచయిత అవలంబించే విధానాలు నాలుగు -- 1.ఒక పాత్రగురించి ఇతర పాత్రలచేత చెప్పించడం, 2.పాత్ర తననుగురించి తాను చెప్పుకోవడం, 3.పాత్ర క్రియలు (మాటలు, చేతలు), 4.దివ్యప్రకాశనము.

ఒక పాత్రను గురించిన ఇతరపాత్రలు చెప్పడం రెండువిధాలు-`1.రూపవర్ణన, 2.శీలవర్ణన, నలుడు దమయంతిని ఇట్లా వర్ణించడం రూపవర్ణనకు ఉదాహరణము.

"ఔరా పెన్నెఱివేణి చంద మరెరే యా మోము నందంబు మ
ర్ఘూరే కన్గవషోయగంబు భళిరే చన్దోయి నిల్పొంక మ
య్యారే బంగరుమేని ముద్దువగ మే లాహా కలావిభ్రమం
బీ రాజాననబోలు సుందరులు లేరెందు స్థరామండలిన్"1

ఇక శీల వర్ణనకు ఉదాహరణ: ప్రతాపరుద్రీయంలో యుగంధరుని గురించి విశ్వాసరావు--

"ఆయన గాలిని బేనును
దొయముతో నఱకు బొగలతో గోడలిడున్
ఆయన ప్రయోగమభినవ
తోయజభవనృష్టి పెఱది దు:స్వప్నమగున్".2

అని చెప్పడంతో యుగంధరుని మేధాసంపత్తి ద్యోతకమవుతుంది. విశాసరావు యుగంధర పక్షీయుడు. యుగంధరుని ప్రత్యర్థికూడా ఇదే ధోరణితో-


1.--- ధర్మవరం రామకృష్ణమాచార్యులు, చిత్రనళీయము, ప్రధమాంకము, తురీయరంగము, పుట 18

2.--వేదం వేంకటరాయశాస్త్రి "ప్రతాపరుద్రీయము" ప్రధమాంకము, పుట 12.