పుట:RangastalaSastramu.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇక, ఈ పాఠ్యపుస్తకాల ప్రయోజన మంటారా, చాలా పరిమితము. ఇవి అసలు విష్యానికి ఉపోద్ఘాతాలు గానూ, అధ్యాపకునకు బోధనోపాధి సాధనాలుగానూ, విధ్యార్ధులకు పాఠ్యసామాగ్రిగానూ మాత్రమే పనికి వస్తాయి. కొన్ని నిర్ణీత పతిమితులు గల ఈ ప్రత్యేక పరిధిలో ఉభయ ప్రయోజనాలను సాధింఛడం సులభసాధ్యం మాత్రంకాదు.

ఈశాష్తాన్ని తెలుగులో వ్యాయడానికి ఎన్నో బాధకాలున్నవి. అందులో ప్రధానమైనది--రంగస్థలశాస్త్ర పారిబాషికపదాల అభావము. కేంద్ర సంగీతనాట్క అకాడమీ (న్యూడిల్లీ) వారి పర్యవేక్షణ కింద హిందీలో తయారైన పారిభాషిక పదసూచిక మాత్రము మన కందుబాటులో ఉన్నది. అయితే లాభమేమీటి ఇటు రచయితలకుగానీ, అటు సంపాదకులకు గానీ అది ప్రస్తుతావసరానికి 'అక్కరకురాని చుట్టమే' అయుంది. అందువల్ల ఈ రచయితలు ఒక తాత్కాలిక పరిష్కారము ఆలోచించినారు. తెలిగింపుకు మరీ లొంగకుండా కనిపించిన ఆంగ్ల పారిభాషిక పదాలను కొన్నింటిని ఏర్చి కూర్చి, తెలుగు అకాడమి నియోగించిన నాటకీయ పరిభాషా నిర్ణేతృ సంఘం (the committee dealing with the glossary of technical terms) వారికి అప్పగించినారు. ఆ కమిటీ వారు స్తిమితంగా సమాలోచన జరిపి ఆ పదావళిని తెలుగులోకి తర్జుమా చేసినారు. ఈ రచయితలు ఆ పదాఅళిని చాలావరకు తమ రచనలో వాడుకొన్నారు. ఈ పదాలను వాడినచోట, అవగాహనకోసం ల్కుందలీకరణాలలో ఆంగ్లపదాలను కూడా ఇవ్వడం జరిగింది.

వివిధ సంస్క్రుతుల నవగాహన చేసుకొన్న వారూ, విభిన్న విధ్యావేత్తలూ, నాటకరంగానుభవం గలవారూఅయిన కొందరు రచయితలు ఈ పాఠ్యా రచనా వ్యవసాయంలో చేతులు కలిపినారు. అందువల్ల శైలీ విఅవిధ్య మేర్పడింది: విభిన్నరుచుల కూడలీ అయింది. దానికి ఒక ఏకసూత్రతనూ సమస్థాయినీ తీసుకొని రావడం సంపాదకుల, నిపుణుల కర్తవ్యమే. అయినా రచయితలు తమ రచనలలో ప్రదర్శించిన వ్యక్తిగర ప్రజ్ఞాపాటవాలనూ, స్వేచ్చా సరణినీ భంగపుచ్చడం న్యాయంకాదు; భంగ;పుచ్చకుండా పనిచేయడం అంతసులభమూ కాదు.