Jump to content

పుట:RangastalaSastramu.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రంగస్థలశాస్త్రల్ మెరిగినవారు మనకు వేళ్ళమీద లెక్కింపదగిన సంఖ్యలో ఉన్నారు. వీరిలో నుంచి ఎన్నుకొన్న కొంతమంది నిష్టాతుల ప్రధమ ప్రయత్నమిది. సహజంగా, అధ్యాపకవృత్తిలోను రంగస్థలకళలోనూ ఉన్న వారు ఇట్టి పనులు స్తిమితంగా చేయదగినవని భావిస్తారు. అయినా ఈ రచన అవసరాన్ని బట్టి అతి శీఘ్రంగా జరగక తప్పలేదు.

ఈ గ్రంధాన్ని బాగా అదివిన తరవాత, బోధించిన తరవాత అధ్యాపక సహృదయులు నిర్మాణాత్మకమైన సలహాలు ఏవైనా అందజేస్తే, కృతజ్ఞతా పూర్వకంగా స్వీకరించి, వాటిని మలిముద్రణలో చేర్చుకొంటాము.