రచయిత్ల కమిటీవారు గుర్తించకపోలేదు. అంతేగాక, తక్కిన లలితకళల అధ్యయనాలలో వలెనే ఈ రంగస్థల కళల అధ్యయనంలో కూడా సిద్ధాంత పరి జ్ఞానం కన్నా ప్రయోగానుభవానికి (practical application) అధిక ప్రాధాన్య మివ్వవలసి ఉంటుందని కూడా వారు గుర్తించినారు. అయినప్పటికీ తెలుగుబాషలో ఈ రంగస్థలకళలను సమగ్రంసుందరంగా వివరించే గ్రంధమొక్కటీ లేకపోవడం వల్లనూ అధ్యాపకులు సైతము శిక్షణపొందేనిదే కొంతకాలందాకాల్ ఈ విష్యాలను బోధించలేనిస్థితిలో ఉన్నందు వల్లనూ, ఈ పాఠ్యపిస్తకాలు రంగస్థలానికి సంబందించిన లనేక విషయాల సమగ్రవివరణ కలిగిఉంటేగానీ ప్రయోజల్నకరాలుగావు. అట్లా సమగ్రంగా ఉన్నప్పుడే అధ్యాపకుడు తన మట్టుకు తానైనా ఈ గ్రంధ సాయాయ్యంతో తద్ విష్యపరిజ్ఞానము సంపాదించుకొని బోధనదక్షుడు కాగల్గుతాడు. అందుకనే ఈ విషయంమీద ఆంగ్లబాషలో ప్రసిద్ధికెక్కిన కొన్ని ఉపయుక్త గ్రంధాలను ఎంచి అనుమబంధంలో సూచించడానికి నిశ్చయించినాము. వాటిని చదివి, వ్యుత్పన్నుడు కావడం అధ్యాపకుని విధి. విధ్యార్ధులంతా కొంత లోతుకువెళ్ళిన తర్వాత, ఈ పట్టికలోని గ్రంధ సందోహాన్ని తమంత తాము చదువుకోగలగని కూడా ఆశిస్తున్నాము. మన విద్యావిధానికే ఈ రంగస్థల శాస్త్రము నూతనము. ఇంతకుముందు స్వాధ్యాయప్రవచనాలలో లేని ఒక పాఠ్యాంశానికి కొత్తగా అధ్యయన ప్రణాళిక వేసేటప్పుడు ఎట్లాంటి సౌకర్యాలూ అవౌకర్యాలూ కలుగుతాయో అని ఇందులోనూ ఉంటాయి. ఈ నవ్యభిత్తిమీద ఇప్పుడు చెరిపివేయలసిందేమీలేదు; సరిదిద్దవలసిందీ లేదు. ఈ అపరిచిత యాత్రలో మనకు దారి చూపడానికి సంసృత సాహిత్యంతోపాటు విదేశీయుల గ్రంధసంచయం(foreign sources) కూడా ఎంతో ఉన్నది.
అయితే, ఈ శాస్త్రాన్ని నేటికి రగినట్లు రూపొందించుకొనే 'పునరుద్ధరణోద్యమం' (revivalism) లో ఎదురయ్యే క్లిష్టఘట్టాలను (pitfalls) దాటడానికీ, మనకు నచ్చని విదేశీయభావాల అంధానుకరణనుంఛి తప్పుకోవడానికి అనువుగా పటిష్టమైన విధానంతో ఈ శాస్త్రము రూపొందవలసి ఉన్నది.
ప్రధానంగా, ఒక సాంస్కృతిక వ్యవస్థయొక్క విశాల రంగమంతటినీ బారలుచాచి వ్యాపింపగల నవీనవిషయమో రంగస్థల శాస్త్రము