Jump to content

పుట:RangastalaSastramu.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాము. ప్రత్యేకంగా ఈ కళల అభ్యసనానికి విద్యాలయాలు మన కుండేవి. మన విద్యాలయాలన్నింటా ఈ కళలన్నింటినో, కాక కొన్నింటినో సామాన్యంగా నేత్పడానికి అవకాశాలున్నవి. ఈకళలను బోధించే విద్యాసంస్థలలో మన రాష్ట్రప్రభుత్వాలు వీటిలో ఉత్తీర్ణులయినవారిని (products) వినియోగించుకోగలుగుతున్నవి. కానీ, రంగస్థల కళలకు ఆ అదృష్ట మింకాపట్టలేదు. ప్రత్యేక విషయం (specialisation) గా తీసుకొన్న విధ్యార్ధులను దీనిని బోధించడానికి బరోడా సంగీత కళాశాల (College of Music, Baroda) లో అవకాశమున్నది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దీనిని 'పార్టుటైం డిప్లమో కోర్సూ చేసినారు. గంగస్థల కళల ప్రగతికి మన జాతీయ నాటక విద్యాలయmu (National Institute of Drama, New Delhi) బాధ్యత వహిస్తున్నది. హైదరాబాద్ లోని నాట్యవిద్యాలయమూ (Natya Vidyalaya) బొంబాయి, కలకత్తా, మద్రాసులలోని నాటరంగసంస్థలకు (Theatre Institutes) అనుబంధంగాఉన్న నాటక బోధనాలయాలూ పేతుకెక్కినవే అయినా, విద్యాసంస్థలు గా పరిగణనకెక్కినవికావు.

మనరాష్ట్రంలో భవిష్యత్ ప్రణాళికారచన జల్రుగుతున్నప్పుడు - 1963లో - అప్పటి విద్యామంత్రి, శ్రీ పి.వి.జి.రాజు ఈ రంగస్థల కళల ప్రాముఖ్యాన్ని గుర్తించి, ఒక ప్రభుత్వ లలితకళల కాలేజీని (Govt. College of Fine Arts) వాల్తేరులో తృతీయ ప్రణాళికా కాలములోనే స్థాపించడానికి అది 1975-76 నాటికి ఒక నిర్ధిష్ట స్వరూపాన్ని అందుకోవడానికి అవకాశాలున్నవేమో పరిశీలించవలసిందని మన (అప్పటి) సాంకేతిక విధ్యాశాఖ డైరెక్టరును నియోగించినారు. కానీ, కొన్ని అంతరాయాల వల్ల ఆ ప్రయత్రము సంభించి పోయింది.

ప్రస్తుత విద్యామంత్రి శ్రీ పి.వి.వరసింహారావు జూనియర్ కాలేజీలలో కొత్తగా వచ్చిన ఇంటర్ మీడియట్ తరగతులలో మానవీయ శాస్త్రాలు (arts) పెట్టవలెననే ప్రతిపాదనను ఆమోదించినారు.

ఈ కోర్సు ఇంకా మనోభావ వికాసం సిద్దించనిస్ధితిలో కొత్తగా కళాశాలలో అడుగుపెట్టే విద్యాఅర్ధులకోసమే అనే సంగరిని పాఠ్య పుస్తక