పుట:RangastalaSastramu.djvu/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రవేశిక

విధ్యార్ధిలో సమగ్ర వ్యక్తిత్వాన్ని రూపొందించడం - అంటే అతడు తనె తీరు తెన్నులను పరిసరానుగుణంగా తీర్చిదిద్దుకొనేటట్లు చెయడం- అద్యతన విద్యా విధాన లక్ష్యాలలో ఒకటి. ఆలోచన (intellect) కూ ఆ వేశాలకూ (emotions) పొత్తు కుదిరితేగానీ ఇది పొందిపొసగేదికారు. కానీ, ఇంతవరకూల్ వ్యవక్తికిగల ఆలోచననాశాఖలు విస్తరించడానికి మాత్రమే మన అధ్యయనాధ్యాననాలు అవిరశంగా (ప్రధానంగా) దోహదము చేసినవి. ఈనాడు వస్తవాన్నీ కల్పననూ (real & imagine) ఆలంబనంగా చేసుకొన్న అనుభూతుల ద్వారా వ్యక్తిలో రసభావాలను (emotions) రేకెత్తించి, తీగ సాగించడంకూడా అత్యవసరమని గుర్తించడం జరుగుతున్నది. మనోభావాల పరిమితి (increased maturity), గుణాగుణ వివేచన (judgement), సమీకరణ (poise), అనగా హన జ్ఞానము (understanding), స్వాతంత్ర్యస్పూర్తి (independence), నాయకత్వ పటిమ (leadership) వంటి గుణ సందోహాన్ని ప్రోదికట్టి పోషించగలిగిన రంగస్థలశాస్త్రము (Theatre Arts) విద్యాలయాలలో ప్రవేశపెట్టడం విద్యార్ధుల మానసిక హార్ధిక (intellectual and emotional life) ప్రవృత్తులను లలితంగా మలచడానికే.

నాటకరంగము ననలు తొడుగుకున్న దేశాంతరాలలో కూడా విద్యా విధాన లక్ష్యాల నందుకోవడానికి ఈ రంగస్థలకళను ఒక బోధనాసాధనం (medium)గా ఎన్నుకోవడం నిన్నమొన్ననే మొదలయిన సంప్రదాయము. విద్యావిదానంలో నాటకరంగము (theatre) విపులంగా వినియోగపడగలదని ఈనాడు అభిజ్ఞలు ఆమోదించినారు. అయితే ఈ అభినయ కళను ఏ ప్రణాళికలో ఏ ప్రకారము అధ్యాపనము చేయవలెనన్న దానిమీద మాత్ర మింకా అభిప్రాయాలు ఏకోన్ముఖాలు కాలేదు.

ఒక మన దేశంసంగతి చూదాము. మనవిద్యావిధానములో సంగీత, నృత్య, వర్ణ చిత్రలేఖన (painting) శిల్పాల స్థానాన్ని మనమేనాడో గుర్తించి